News February 21, 2025
జగిత్యాల జిల్లాలో నేటి TOP NEWS

@ జిల్లా వ్యాప్తంగా MLC ఎన్నికల ప్రచారం @ మేడిపల్లి, కోరుట్లలో పర్యటించిన కలెక్టర్ @అదనపు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్కిల్ కమిటీ సమావేశం @ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఆదాయం వివరాలు @ ధర్మపురిలో పర్యటించిన ప్రభుత్వ విప్ అడ్లూరి @ కొడిమ్యాల: క్రీడలలో విద్యార్థినుల ప్రతిభ.. ఎస్పీ ప్రశంసా @ చెగ్యంలో ఘనంగా ముగిసిన మల్లన్న బోనాలు @ వెల్గటూరు ZPHSలో తరగతి గదిని పరిశీలించిన DEO రాము.
Similar News
News February 22, 2025
విపక్షాల ట్రాప్‌లో పడొద్దు: భట్టి

TG: కులగణనలో వివరాలు ఇవ్వని వారి కోసం ప్రభుత్వం మరో అవకాశాన్ని ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. దీనిపై కుట్రలో భాగంగానే విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. విపక్షాల ట్రాప్‌లో పడొద్దని ప్రజలకు సూచించారు. పారదర్శకతతో తాము ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. ప్రజలకు మేలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
News February 22, 2025
సిరిమాను చెట్టును ఊరేగించేందుకు ఏర్పాట్లు

శ్రీ శ్యామలాంబ అమ్మవారి సిరిమాను చెట్టును అల్లువీధి చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు 30 జతల ఎద్దులతో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ దగ్గర నుంచి శ్రీ శ్యామలాంబ అమ్మవారి గుడి మీదుగా శివాజీ సెంటర్, బోసు బొమ్మ జంక్షన్, డబ్బివీధి, కోట జంక్షన్, NTR బొమ్మ జంక్షన్, మెయిన్ రోడ్డు మీదుగా అల్లు వీధికి చేర్చనున్నారు. ఈ సందర్భంగా కోలాటం, తప్పెటగుళ్ల ప్రదర్శన ఉంటుందని కమిటీ తెలిపింది.
News February 22, 2025
మహా కుంభాభిషేకానికి కేసీఆర్‌కు ఆహ్వానం

రేపు యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపుర మహా కుంభాభిషేకానికి రావాలని మాజీ సీఎం కేసీఆర్‌ను ఆలయ పూజారులు కలిసి ఆహ్వానం అందించారు. అలాగే మార్చి 1 నుంచి 11 వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. ఆలయ ప్రధాన అర్చకులు వెంకటేశ్వరాచార్యులు, డీఈవో భాస్కర్, ముఖ్య అర్చకులు తదితరులు ఉన్నారు. కాగా, గతంలో పలు కార్యక్రమాలకు ఆహ్వానించినా కేసీఆర్ హాజరు కాలేదు. ఇప్పుడైనా వెళ్తారా అనేది చూడాలి.