News February 3, 2025

జగిత్యాల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు

image

జగిత్యాల జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని నెల రోజుల ( ఫిబ్రవరి 1వ తేది నుంచి 28 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు నిర్వహించరాదని ఆయన అన్నారు.

Similar News

News February 3, 2025

కడప: YVU పీజీ పరీక్షా ఫలితాలు విడుదల

image

వైవీయూ, అనుబంధ కళాశాలల ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం మూడో సెమిస్టర్ పరీక్షలలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని వీసీ ఆచార్య కె. కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం తమ చాంబరులో రిజిస్ట్రార్ ప్రొ పి.పద్మ, సీఈ ప్రొ కెఎస్వీ కృష్ణారావుతో కలిసి పీజీ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం https:www.yvuexams.in/results.aspx అనే వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. ఏసీఈలు డా.మమత, డా.శ్రీనివాసులు పాల్గొన్నారు.

News February 3, 2025

గ్రూప్-1 ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్

image

TG: గ్రూప్-1 పరీక్ష ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. నియామకాలపై వివిధ రకాల అభ్యంతరాలతో పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో త్వరలోనే గ్రూప్-1 ఫలితాలు విడుదల కానున్నాయి.

News February 3, 2025

ట్రంప్‌తో మోదీ భేటీ.. ఎప్పుడంటే?

image

PM మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో త్వరలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ప్రధాని ఈ నెల రెండోవారంలో ఫ్రాన్స్, అమెరికా పర్యటనలకు వెళ్లే అవకాశం ఉంది. ఆ సమయంలోనే ఆయన ఫిబ్రవరి 13న వాషింగ్టన్‌లో ట్రంప్‌తో భేటీ కానున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. మోదీతో సమావేశం నేపథ్యంలో ట్రంప్ డిన్నర్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. గత నెల 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.