News February 18, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి CRIME NEWS!

image

@గ్రీవెన్స్ డేలో 10 మంది అర్జీదారులతో ఎస్పీ @మైనర్ బాలికతో అసభ్య ప్రవర్తన.. నిందితుడికి 45 రోజుల జైలు శిక్ష..రూ.500 జరిమానా @జగిత్యాల పట్టణంలోని ఇంట్లో కాలిన కరెంటు మీటర్ @ఇబ్రహీంపట్నంలో ఎస్ఐ అనిల్ ఆధ్వర్యంలో వాహన తనిఖీలు @కథలాపూర్‌లో యువకుడు ఊరేసుకుని ఆత్మహత్య @పెగడపల్లిలో రైతులను మోసం చేసిన వ్యక్తులను రిమాండ్ చేసిన పోలీసులు @రాయికల్‌లో ఇద్దరు మృతి.. ఆర్థిక సాయం అందజేసిన గ్రామస్థులు

Similar News

News December 26, 2025

చెలరేగిన బౌలర్లు.. లంక 112 రన్స్‌కే పరిమితం

image

శ్రీలంక ఉమెన్స్‌తో జరుగుతున్న మూడో టీ20లో భారత బౌలర్లు అదరగొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకను 20 ఓవర్లలో 112/7 పరుగులకే పరిమితం చేశారు. రేణుకా ఠాకూర్ 4, దీప్తీ శర్మ 3 వికెట్లతో చెలరేగారు. లంక బ్యాటర్లలో దులానీ 27, పెరీరా 25, దిల్హరీ 20, నుత్యాంగన 19 మినహా మిగతావారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

News December 26, 2025

నీటి పొదుపుతో ఆర్థిక వృద్ధి

image

ప్రవహించే నీరు సంపదకు చిహ్నమని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ఇంట్లో కుళాయిలు కారుతూ నీరు వృథా కావడమంటే లక్ష్మీదేవి అనుగ్రహం క్రమంగా హరించుకుపోవడమే అని అంటున్నారు. ‘నీటి వృథా ప్రతికూల శక్తిని పెంచి మనశ్శాంతిని దూరం చేస్తుంది. అదనపు ఖర్చును పెంచుతుంది. కారుతున్న కుళాయిలను వెంటనే బాగు చేయిస్తే ఇంట్లో సానుకూలత ఏర్పడుతుంది. నీటిని గౌరవిస్తే సంపదను కాపాడుకోవచ్చు’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>

News December 26, 2025

‘రాజాసాబ్’ నుంచి మాళవిక లుక్ రిలీజ్

image

ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి హీరోయిన్ మాళవికా మోహనన్ ‘భైరవి’ లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. కొన్ని గంటల క్రితం మాళవిక Xలో ‘AskMalavika’ నిర్వహించారు. చాలామంది ఫ్యాన్స్ ‘మూవీలో మీ లుక్‌ను ఎందుకు ఇంకా రివీల్ చేయడంలేదు’ అని ప్రశ్నించారు. ఆమె నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీని ట్యాగ్ చేస్తూ ఇదే క్వశ్చన్ అడగడంతో పోస్టర్‌ విడుదల చేసింది. JAN 9న విడుదలయ్యే రాజాసాబ్ ప్రీరిలీజ్ ఈవెంట్ HYDలో రేపు జరగనుంది.