News February 19, 2025

జగిత్యాల జిల్లాలోని నేటి TOP NEWS!

image

@జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం @రాష్ట్రస్థాయి పోటిల్లో జగిత్యాల బిడ్డల సత్తా @కలెక్టర్‌తో సీఎస్ వీడియో సమావేశం @గొల్లపల్లి విద్యార్థికి అథ్లెటిక్స్‌ సిల్వర్ మెడల్ @కథలాపూర్‌లో జిల్లా వైద్యాధికారి తనిఖీలు @మల్లాపూర్‌లో పర్యటించిన DRDO PD@కొండగట్టులో భక్తుల రద్దీ @జగిత్యాలలో ఘనంగా శ్రీనివాస కళ్యాణ మహోత్సవం @కోరుట్ల మల్లన్న జాతరలో పాల్గొన్న MLA సంజయ్

Similar News

News March 12, 2025

జగన్‌పై విజయసాయి సంచలన వ్యాఖ్యలు

image

AP: మాజీ CM YS జగన్‌పై YCP మాజీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కోటరీకి అనుకూలంగా ఉంటేనే జగన్ దగ్గరికి తీసుకెళ్తారు. కోటరీ మాటలు వినొద్దని జగన్‌కు చాలాసార్లు చెప్పినా ఫలితం లేదు. చెప్పుడు మాటలను నాయకుడు వినకూడదు. జగన్ మనసులో స్థానం లేదు కాబట్టి YCP నుంచి బయటకు వచ్చా. నా మనసు విరిగిపోయింది. విరిగిన మనసు మళ్లీ అతుక్కోదు. తిరిగి వైసీపీలో చేరే ప్రసక్తే లేదు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News March 12, 2025

గుంటూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

గుంటూరులో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని కొత్తపేట పోలీసులు తెలిపారు. జీజీహెచ్ ఆసుపత్రి మెయిన్ గేట్ వద్ద వ్యక్తి చనిపోయాడని సెక్యూరిటీ గార్డు కొత్తపేట పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు మార్చురీకి తరలించారు. ఈ వ్యక్తి ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే పోలీసుల్ని సంప్రదించాలని కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News March 12, 2025

పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటాం: ఎస్పీ

image

పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటామని బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ఎమ్.సంపూర్ణ రావు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు సంపూర్ణ రావు సతీమణి మార్తమ్మకు బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఫ్లాగ్ ఫండ్, విడో ఫండ్ చెక్‌లను జిల్లా ఎస్పీ అందజేశారు.

error: Content is protected !!