News March 28, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి ముఖ్యాంశాలు!

@జిల్లాలోని నేటి 10వ తరగతి పరీక్షకు 7గురు గైర్హాజరు @ ధర్మపురి తహశీల్దార్ కార్యాలయం ఎదుట బీజేపీ నాయకుల నిరసన@ కోరుట్ల ఏరియా ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర బృందం @ ధర్మపురి నరసింహ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ@ పెగడపల్లి గ్రామపంచాయతీని తనిఖీ చేసిన మండల పంచాయతీ అధికారి@ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సమగ్ర గర్భస్రావ సంరక్షణ శిక్షణ @ రాయికల్ లో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు
Similar News
News April 3, 2025
‘మ్యాడ్ స్క్వేర్’ సక్సెస్ మీట్‌కు చీఫ్ గెస్ట్‌గా NTR

నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ రేపు సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించనున్నారు. ఈ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా వస్తున్నట్లు ప్రకటించారు. తారక్ తన సినిమాలను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటారని తెలియజేస్తూ నిర్మాత నాగవంశీ Xలో స్పెషల్ పోస్టర్ షేర్ చేశారు.
News April 3, 2025
HYD: సెక్రటేరియట్ ముందు ఇదీ పరిస్థితి

భారీ వర్షం కారణంగా రహదారులపై వర్షపు నీరునిలిచిపోయింది. తెలంగాణ సచివాలయం వద్ద రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. అటు ఖైరతాబాద్ KCP జంక్షన్, సోమాజిగూడలో ప్రధాన రహదారులపై చెట్లు నేలకొరిగాయి. భారీగా ట్రాఫిక్ జామైంది. వాహననదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. అత్యవసరం అయితేనే బయటకురండి. SHARE IT
News April 3, 2025
కంచ భూములపై ఫేక్ వీడియోలు.. BRS IT సెల్ ఇంచార్జిలపై కేసు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచె భూములను ప్రభుత్వం చదును చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, అక్కడి పరిస్థితులను తప్పుదోవ పట్టించేలా కొన్ని ఫొటోలు, వీడియోలు ఎడిట్ చేసి సర్క్యులేట్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఈక్రమంలో గచ్చిబౌలి పోలీసులు ఫేక్ వీడియోలను క్రియేట్ చేశారనే ఆరోపణలపై BRS IT సెల్ ఇంచార్జ్‌లు క్రిశాంక్ & కొణతం దిలీప్‌లపై కేసు నమోదు చేశారు.