News April 13, 2025
జగిత్యాల జైత్రయాత్ర గురించి మీకు తెలుసా..?

వేలాది జనం భూస్వామ్య వ్యవస్థపై జగిత్యాలలో 1978 సెప్టెంబరు 9న రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభనే జగిత్యాల జైత్రయాత్రగా చరిత్రపుటల్లో లిఖించి ఉంది. ఈ సభకు ప్రజాయుద్ధనౌక గద్దర్ హాజరై తన ఆటపాటలతో జనాన్ని ఉర్రూతలూగించారు. రైతుకూలీ సంఘాలు పీపుల్స్ వార్‌గా, మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందడానికి జగిత్యాల జైత్రయాత్ర బీజం వేసిందని చెబుతుంటారు. తెలంగాణ విప్లవోద్యమ చరిత్రకు ఇది ఊపునిచ్చింది.
Similar News
News April 15, 2025
గవాస్కర్ గొప్ప మనసు!

భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ గొప్ప మనసు చాటుకున్నారు. ఆయనకు చెందిన ‘ది ఛాంప్స్’ ఫౌండేషన్ ద్వారా మాజీ క్రికెటర్ కాంబ్లీకి సాయం చేసేందుకు ముందుకొచ్చారని జాతీయ మీడియా తెలిపింది. నెలకు రూ.30వేల చొప్పున అందించనున్నట్లు పేర్కొంది. అనారోగ్య సమస్యల నుంచి కోలుకుంటున్న కాంబ్లీని ఇటీవల వాంఖడే గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో గవాస్కర్ కలిశారు. ఆయన పరిస్థితి తెలుసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
News April 15, 2025
మంత్రులు అప్రమత్తంగా ఉండాలి: CM చంద్రబాబు

AP: ప్రతిపక్ష ఆరోపణల్ని సమర్థంగా తిప్పికొట్టాలని క్యాబినెట్ భేటీలో మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అధికారుల అవినీతిపై తరచూ చర్చలు సరికాదని, ఎవరి శాఖల పరిధిలోని అంశాలపై వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక జగన్ కుల, మత, ప్రాంతాలను రెచ్చగొడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎస్వీ గోశాల, పాస్టర్ ప్రవీణ్ మృతి, వక్ఫ్ బిల్లుపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, వీటిని తిప్పికొట్టాలన్నారు.
News April 15, 2025
ఉమ్మడి గుంటూరు జిల్లాలో 249 పోస్టులు

ఉమ్మడి గుంటూరు జిల్లాలో 249 ప్రత్యేక విద్యా ఉపాధ్యాయుల పోస్టుల మంజూరుకు మంగళవారం జీవో విడుదలైంది. వీటిలో ఉమ్మడి జిల్లాకు 151 SGT(ప్రాథమిక స్థాయి), 98 స్కూల్ అసిస్టెంట్ల(ద్వితీయ స్థాయి) పోస్టులు మంజూరయ్యాయి. ఈ పోస్టులను ఇప్పటికే ఉన్న సర్ప్లస్ ఉపాధ్యాయ పోస్టులను మార్చి రూపొందించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.