News April 13, 2025

జగిత్యాల జైత్రయాత్ర గురించి మీకు తెలుసా..?

image

వేలాది జనం భూస్వామ్య వ్యవస్థపై జగిత్యాలలో 1978 సెప్టెంబరు 9న రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన భారీ బహిరంగ సభనే జగిత్యాల జైత్రయాత్రగా చరిత్రపుటల్లో లిఖించి ఉంది. ఈ సభకు ప్రజాయుద్ధనౌక గద్దర్‌ హాజరై తన ఆటపాటలతో జనాన్ని ఉర్రూతలూగించారు. రైతుకూలీ సంఘాలు పీపుల్స్‌ వార్‌గా, మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందడానికి జగిత్యాల జైత్రయాత్ర బీజం వేసిందని చెబుతుంటారు. తెలంగాణ విప్లవోద్యమ చరిత్రకు ఇది ఊపునిచ్చింది.

Similar News

News April 15, 2025

మల్కాపురం: బాలికతో అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు

image

మల్కాపురం పోలీస్ స్టేషన్‌‌లో మంగళవారం పోక్సో కేసు నమోదైంది. సీఐ విద్యాసాగర్ మాట్లాడుతూ.. మల్కాపురంలో అంగ కృష్ణ ఇంట్లో ఓ కుటుంబం అద్దెకు ఉంటోంది. వారికి 11 ఏళ్ల బాలిక ఉంది. సోమవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి యజమాని బాలికతో అసభ్యకరంగా ప్రవరించాడు. బాలిక తల్లి ఫిర్యాదుతో మంగళవారం పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.

News April 15, 2025

భూస‌మీక‌ర‌ణ‌పై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేదు: నారాయణ

image

అమ‌రావ‌తిలో మ‌రోసారి భూస‌మీక‌ర‌ణ‌పై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు. మంగవారం మంత్రి నారాయ‌ణ‌ 5వేల ఎక‌రాల్లో ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్ పోర్ట్ నిర్మాణం చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు నిర్నయించార‌ని, దానికోసం భూమి అవ‌సరం ఉంద‌న్నారు. అయితే ల్యాండ్ ఎక్విజిష‌న్ ద్వారా భూములు తీసుకుంటే రైతులు న‌ష్ట‌పోతార‌నే విష‌యాన్ని స్థానిక ఎమ్మెల్యేలు త‌న దృష్టికి తీసుకువ‌చ్చిన‌ట్లు మంత్రి అన్నారు. 

News April 15, 2025

డబ్బు కాదు విధేయత ముఖ్యం.. అందుకే KKRను వీడలేదు: రమణ్‌దీప్

image

KKR తనను రూ.4 కోట్లకు రిటైన్ చేసుకోవడం వెనుక ఉన్న కథను రమణ్‌దీప్ వెల్లడించారు. వేలానికి ముందు రిటైన్‌కు ఒప్పుకోవద్దని, రూ.9-10 కోట్లతో కొనుగోలు చేస్తామని చాలా టీమ్స్ ఆఫర్ ఇచ్చాయన్నారు. అయితే తనకు తొలుత అవకాశం ఇచ్చిన KKRపై విధేయత ఉందని చెప్పారు. అందుకే డబ్బు తక్కువైనా టీమ్‌లోనే ఉంటానని మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్లు తెలిపారు. వేలంలోకి వెళితే ఇదే జట్టులోకి వస్తాననే గ్యారంటీ లేదన్నారు.

error: Content is protected !!