News April 8, 2025
జగిత్యాల: నామాపూర్ విద్యార్థులకు గోల్డ్ మెడల్

సైన్స్ ఒలంపియాడ్ ఫౌండేషన్ న్యూఢిల్లీ నిర్వహించిన పరీక్షలో పెగడపల్లి మండలం నామాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. అన్నాడు చైత్ర రెడ్డి, చెక్క బండి సుస్మిత, సాయి రాజా హంసిత, ఈగ అరుణ్ ఈ పోటీల్లో పాల్గొని జోనల్ స్థాయి ర్యాంకులు సాధించి బంగారు పథకాలు సాధించారు. పథకాలు సాధించిన విద్యార్థులను ఎంఈవో మాదాడి సులోచన, ఉపాధ్యాయులు అభినందించారు.
Similar News
News April 17, 2025
నేడే జేఈఈ మెయిన్ ఫలితాలు

JEE మెయిన్ ఫలితాలను నేడు NTA విడుదల చేయనుంది. 2 సెషన్లు పూర్తవడంతో ర్యాంకులు కూడా ఇస్తామని తెలిపింది. అధికారిక సైట్‌లో అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి <
News April 17, 2025
సిద్దిపేట: ‘1100 ఏళ్ల నాటి జైన విగ్రహాన్ని కాపాడుకోవాలి’

నంగునూరు మండలం చిన్నకొండ పైన ఉన్న జైన విగ్రహాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్,సీఈఓ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద విగ్రహంగా పేరు ఉన్న జైన విగ్రహాన్ని బుధవారం ఆయన కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులతో కలిసి పరిశీలించారు.1100 సంవత్సరాల చరిత్ర గల జైన విగ్రహాన్ని ప్రభుత్వం పట్టించుకుని పర్యాటక కేంద్రం చేయాలన్నారు.
News April 17, 2025
విశాఖ: సమతా ఎక్స్ ప్రెస్ రద్దు

నాగపూర్ డివిజన్‌లో ఇంటర్ లాకింగ్ పనులు వలన విశాఖ నుంచి బయలుదేరే పలు రైలు రద్దు చేసినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం సందీప్ బుధవారం తెలిపారు. ఈ మేరకు విశాఖ- నిజాముద్దిన్ సమతా ఎక్స్‌ప్రెస్ (12807/12808) ఏప్రిల్ 30 నుంచి మే 8 వరకు రద్దు చేసినట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు.