News April 5, 2025
జగిత్యాల నుంచి TPCC సేవాదళ్ సెక్రటరీగా ముకేశ్ ఖన్నా

జగిత్యాల పట్టణానికి చెందిన బోగోజీ ముకేశ్ ఖన్నాను TPCC సేవాదళ్ సెక్రటరీగా నియమించారు. 2007 నుంచి కాంగ్రెస్ విద్యార్థి విభాగం NSUIలో ఉన్న ముకేశ్‌కు జగిత్యాల నుంచి రాష్ట్ర స్థాయి పదవి లభించడంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన నియామకం పార్టీకి మరింత బలాన్ని ఇస్తుందని నేతలు అభిప్రాయపడ్డారు.
Similar News
News April 6, 2025
మార్కెట్ క్రాష్‌ను జయించిన వృద్ధుడి చాతుర్యం

టారిఫ్స్ ఎఫెక్ట్‌తో స్టాక్‌మార్కెట్స్ క్రాష్ అయి మస్క్, బెజోస్, బిల్‌గేట్స్ తదితర కుబేరులు రూ.కోట్ల సంపద కోల్పోయారు. అయితే టాప్10 బిలియనీర్ల జాబితాలో 94 ఏళ్ల వారెన్ బఫెట్ మాత్రమే $12.7B లాభాలతో మార్కెట్ పతనాన్ని జయించారు. కన్జూమర్ గూడ్స్, ఎనర్జీ, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ సెక్టార్లలో ట్రేడింగ్‌తో పాటు ఈక్విటీ షేర్స్ అమ్మేసి షార్ట్ టర్మ్ US ట్రెజరీ బిల్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ఆయన సక్సెస్ సీక్రెట్స్.
News April 6, 2025
HYD: చికెన్ దుకాణాలు ఖాళీ

మాంసం ప్రియులకు సండే పండగే. ఉదయం చికెన్, మటన్ షాపుల వద్ద క్యూలైన్లు, కిటకిటలాడే గిరాకీ షరామామూలే. కానీ, ఈ ఆదివారం శ్రీ రామ నవమి కావడంతో దృశ్యం పూర్తిగా మారిపోయింది. ప్రతాపసింగారం సహా HYDలోని అనేక మాంసం దుకాణాలు వెలవెలబోయాయి. ఎప్పుడూ జనసంద్రంగా మారే మార్కెట్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ఇదే సీన్ గత వారం ఉగాది రోజూ కనిపించింది. పండుగల దెబ్బకు అమ్మకాలు పూర్తిగా తగ్గాయని వ్యాపారస్థులు చెబుతున్నారు.
News April 6, 2025
అమరావతిలో కొత్త రైలు మార్గానికి శుభారంభం

ఎర్రుపాలెం-నంబూరు మధ్య నూతన రైల్వేలైన్ నిర్మాణానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ మేరకు అమరావతి మీదుగా వెళ్లే ఈ మార్గానికి భూసేకరణలో పురోగతి కనిపించడంతో, రైల్వేశాఖ పనులు ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. తొలి దశలో 27 కిలో మీటర్ల రైలు ట్రాక్, కృష్ణా నదిపై వంతెన నిర్మాణానికి టెండర్‌లు రెండు నెలల్లో పిలవనున్నట్లు సమాచారం.