News March 5, 2025
జగిత్యాల: నేడే పరీక్షలు.. ALL THE BEST

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 14,450 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాయనున్నారు. ఫస్టియర్ 7,073, సెకండియర్‌లో 7,377 మంది విద్యార్థులు రాయనుండగా.. 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇంటర్ పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో BNS 163(144) సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. ఒక నిమిషం ఆలస్యాన్ని తాజాగా 5 నిమిషాలకు సడలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ALL THE BEST
Similar News
News December 18, 2025
అంకితభావం చాటిన అధికార యంత్రాంగం!

కామారెడ్డి జిల్లాలో మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిశాయని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఎన్నికల నిర్వహణలో అంకితభావంతో పనిచేసిన అన్ని శాఖల అధికారులను, సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు గాను ఎన్నికల విభాగాల సిబ్బంది కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
News December 18, 2025
రాజీ మార్గమే రాజ మార్గం: ఎస్పీ స్నేహ మెహ్ర

ఈనెల 21న నిర్వహించే జాతీయ మెగా లోక్-అదాలత్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. క్షణికావేశంలో జరిగిన చిన్న తప్పులు, అనవసర వివాదాలను పరిష్కరించుకోవడానికి లోక్-అదాలత్ ఒక ఉత్తమ అవకాశం అని పేర్కొన్నారు. రాజీ కుదుర్చుకునే అవకాశం ఉన్న అన్ని రకాల కేసుల్లో కక్షిదారులు పరస్పర అంగీకారంతో రాజీ పడాలన్నారు.
News December 18, 2025
వైద్యం కోసం పేదలు ఆస్తులు అమ్ముకోవాలి: జగన్

AP: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేదలు వైద్యం కోసం ఆస్తులు అమ్ముకోవలసి వస్తుందని YCP చీఫ్ జగన్ చెప్పారు. కోటి సంతకాలను గవర్నర్‌కు సమర్పించి CBN స్కామ్‌ను వివరించామన్నారు. ‘స్కూళ్లు, ఆసుపత్రులను ప్రభుత్వం నడపకపోతే ఆ సేవలు పేదలకు భరించరానివి అవుతాయి. ₹8వేల CRతో 17 కాలేజీలను భూములు సేకరించి కట్టాం. 7 కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. మీకు చేతకాకపోతే మేం వచ్చాక పూర్తిచేస్తాం’ అని అన్నారు.


