News February 9, 2025
జగిత్యాల: పీఎంఈజీసీ రుణాల పేరుతో మోసం.. అరెస్టు
ప్రధానమంత్రి ఎంప్లాయిమెంట్ గ్యారంటీ ప్రోగ్రాం కింద సబ్సిడీ రుణాలు ఇప్పిస్తానని జగిత్యాల జిల్లాలో వేణు వర్మ అనే యువకుడు పలువురి నుంచి లక్షల్లో వసూలు చేశాడు. మంచిర్యాల జిల్లా హజీపూర్కు చెందిన వేణు వర్మను బాధితులు శనివారం JGTL పట్టణంలోని తీన్ ఖని ప్రాంతంలో పట్టుకుని జగిత్యాల టౌన్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 10, 2025
MBNR: చేపల విక్రయ వాహనాలను ప్రారంభించిన కలెక్టర్
ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన రుణాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సూచించారు. సోమవారం స్త్రీ నిధి బ్యాంక్ రుణం ద్వారా అందించిన సంచార చేపల విక్రయ వాహనాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. వాహనాన్ని ఎక్కడ వినియోగిస్తారు, వ్యాపారం ఎలా చేస్తారు అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
News February 10, 2025
ADB: పత్తి కొనుగోళ్లు తాత్కాలికంగా బంద్
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు తాత్కాలికంగా నిలిపి వేసినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు సోమవారం తెలిపారు. రైతుల ఆధార్ వెరిఫికేషన్‌లో పలు సాంకేతిక సమస్యల రీత్యా కొనుగోళ్లు నిలిపివేసినట్లు వెల్లడించారు. తర్వాత కొనుగోళ్లు తేదీని వెంటనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. ఈ విషయమై రైతులు సహకరించాలని కోరారు.
News February 10, 2025
జీ.కోడూరు సర్పంచ్ సస్పెండ్
అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం జీ.కోడూరు పంచాయతీ సర్పంచ్ బొడ్డేటి అమ్మాజీ లక్ష్మినీ సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు ఎంపీడీవో సీతామాలక్ష్మి తెలిపారు. సర్పంచ్‌ని మూడు నెలల పాటు సస్పెండ్ చేస్తూ ఉప సర్పంచ్‌కి బాధ్యతలు అప్పగించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. నిధుల దుర్వినియోగానికి సంబంధించి సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.