News April 5, 2025

జగిత్యాల :పోలీస్ ప్రధాన కార్యాలయంలో డా.జాగ్జీవన్ జయంతి

image

జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జాగ్జీవన్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య సమరయోధులు, సంఘ సంస్కర్త సమానత్వ ఉద్యమానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచారన్నారు. భారత సమాజ నిర్మాణంలో తనదైన ముద్ర వేశారన్నారు.

Similar News

News April 6, 2025

కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల వారి సమస్యలపై వినతులు స్వీకరిస్తామన్నారు. వాటిని సంబంధిత అధికారులకు పంపి సమస్యల పరిష్కారాలకు చేస్తామన్నారు.

News April 6, 2025

విదేశీ పర్యటనకు బయలుదేరిన రాష్ట్రపతి

image

రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నాలుగు రోజుల విదేశీ పర్యటనకు బయలుదేరారు. పోర్చుగల్, స్లోవేకియా దేశాల అధ్యక్షుల ఆహ్వనం మేరకు రాష్ట్రపతి ఆ దేశాలకు వెళ్లనున్నారు. 7,8న పోర్చుగల్‌లో 9,10 తేదీలలో స్లోవేకియాలో ఆమె పర్యటించనున్నారు. ఈ దేశాలలో భారత రాష్ట్రపతి పర్యటించడం దాదాపు 25 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.

News April 6, 2025

BREAKING: టాస్ గెలిచిన GT

image

IPL2025: ఉప్పల్ వేదికగా SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో GT కెప్టెన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు.
GT: సాయి సుదర్శన్, గిల్, బట్లర్, తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, సుందర్, సాయి కిషోర్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్
SRH: హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్, క్లాసెన్, అనికేత్, కమిందు, కమిన్స్, అన్సారీ, ఉనద్కత్, షమీ

error: Content is protected !!