News March 20, 2025
జగిత్యాల: ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు.. పురుగు మందు తాగి ఆత్మహత్య

జగిత్యాల జిల్లాలో ఓ బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు, బాలుడు వేధించగా ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రవికిరణ్ వివరాల ప్రకారం.. పెగడపల్లి మండలం రామభద్రునిపల్లికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన రాము అనే యువకుడు, రంగదామునిపల్లికి చెందిన మరో బాలుడు ప్రేమ పేరుతో వేధించారు. అది భరించలేక ఈనెల 15న బాలిక పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.
Similar News
News March 31, 2025
VKB: పోలీస్ స్టేషన్‌గా మారిన ఆర్డీవో ఆఫిస్

పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం పోలీస్ స్టేషన్గా కనిపిస్తుండడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంను పోలీస్ కార్యాలయంగా మార్చిన వెబ్ సిరీస్ షూటింగ్ నిర్వాహకులు. వికారాబాద్ ఆర్డిఓ కార్యాలయాన్ని ఆదివారం సెలవు ఉండడంతో వెబ్ సిరీస్‌కు అనుమతి ఇచ్చారు. దీంతో నిర్వాహకులు ఆర్డీవో కార్యాలయాన్ని పోలీస్ స్టేషన్‌గా మార్చి షూటింగ్ నిర్వహిస్తున్నారు.
News March 31, 2025
కుల్కచర్ల: గ్రూప్-1 అధికారిగా మోనికా రాణి

కుల్కచర్ల మండల కేంద్రానికి చెందిన మోనికా రాణి ఈరోజు TSPSC విడుదలైన గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ లిస్టులో రాష్ట్రస్థాయిలో 263వ ర్యాంక్, ఎస్సీ కేటగిరిలో 16వ ర్యాంకు సాధించి గ్రూప్-1 అధికారిగా ఎంపికైంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తుంది.రాష్ట్ర వ్యాప్తంగా 563 గ్రూప్-1 పొస్టులు ఉండగా మల్టి జోన్లో ఎస్సీ కేటగిరి విభాగంలో 48 పోస్టులు ఉన్నాయి.
News March 31, 2025
నేడు 38 మండలాల్లో వడగాలులు

AP: రాష్ట్రంలో ఇవాళ 38 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. శ్రీకాకుళం-8, విజయనగరం-9, మన్యం-10, అల్లూరి-2, తూర్పుగోదావరి-8, ఏలూరు జిల్లాలోని వేలేరుపాడులో వడగాలులు వీస్తాయని పేర్కొంది. అలాగే చింతూరు, కూనవరం మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో నిన్న ఉష్ణోగ్రతలు మండిపోయాయి. ప్రకాశం జిల్లా అమాని గుడిపాడులో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.