News March 20, 2025
జగిత్యాల: ప్రేమ పేరుతో బాలికకు వేధింపులు.. పురుగు మందు తాగి ఆత్మహత్య

జగిత్యాల జిల్లాలో ఓ బాలికను ప్రేమ పేరుతో ఓ యువకుడు, బాలుడు వేధించగా ఆమె పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రవికిరణ్ వివరాల ప్రకారం.. పెగడపల్లి మండలం రామభద్రునిపల్లికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన రాము అనే యువకుడు, రంగదామునిపల్లికి చెందిన మరో బాలుడు ప్రేమ పేరుతో వేధించారు. అది భరించలేక ఈనెల 15న బాలిక పురుగుల మందు తాగగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది.
Similar News
News March 21, 2025
కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు

కరీంనగర్ జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా గంగాధర మండలంలో 37.9°C నమోదు కాగా, శంకరపట్నం 37.8, కరీంనగర్ రూరల్ 37.6, జమ్మికుంట 37.5, గన్నేరువరం 36.8, చొప్పదండి, మానకొండూర్ 36.6, రామడుగు 36.5, చిగురుమామిడి 36.4, వీణవంక 36.3, తిమ్మాపూర్ 36.1, కరీంనగర్ 36.0, కొత్తపల్లి 35.2, ఇల్లందకుంట 35.0, హుజూరాబాద్ 34.9, సైదాపూర్ 34.0°C గా నమోదైంది.
News March 21, 2025
జమ్మికుంట: శ్రీశైలం డ్యామ్‌లో పడి విద్యార్థి మృతి

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సాగర్ల సాయి తేజ (19) తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు ఏపీలోని శ్రీశైలం వెళ్లాడు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అక్కడ జలాశయంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. కాగా సాయితేజ HYDలో పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సాయితేజ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News March 20, 2025
KNR: ఏసీపీ కార్యాలయాన్ని తనిఖీ చేసిన సీపీ

కరీంనగర్ కమిషనర్ పరిధిలోని రూరల్ డివిజన్ ఏసీపీ కార్యాలయాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ తనిఖీ చేశారు. డివిజన్ పరిధి అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక దిగా ఏర్పాటు చేయాలని అన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలలో అవగాహన పెంచాలని తెలిపారు.