News February 8, 2025
జగిత్యాల: బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738979446493_1259-normal-WIFI.webp)
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ శివార్లలో వాగు వద్ద గల బావిలో ఓ వ్యక్తి మృతదేహం శుక్రవారం రాత్రి లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బహిర్భూమి కోసం వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి ఉంటాడని తెలుపుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి ఎస్‌ఐ ఉదయ్ వెళ్లి పరిశీలించారు. మృతుడు జగిత్యాలకు చెందిన ఎండీ హమీద్‌గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 8, 2025
అరవింద్ కేజ్రీవాల్ ఓటమి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738998189061_1199-normal-WIFI.webp)
ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీకి అతిపెద్ద షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన కంచుకోట న్యూఢిల్లీ నుంచి ఓటమి చవిచూశారు. బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ఆయన్ను 3182 ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. ఇక్కడి నుంచి వరుసగా మూడు సార్లు గెలిచిన ఆయన్ను నాలుగోసారి ప్రజలు తిరస్కరించారు. లిక్కర్ స్కామ్, వాటర్ స్కామ్, అవినీతి, క్లీన్ ఇమేజ్ పోవడం ఇందుకు కారణాలు.
News February 8, 2025
మెదక్ జిల్లాలో ఓటర్ల లెక్క తేలింది
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738995430766_50139766-normal-WIFI.webp)
గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం అధికార యంత్రాంగం సిద్ధం అవుతోంది. మెదక్ జిల్లాలో 493 గ్రామపంచాయతీలుండగా, మొత్తం 5,25,478మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,52,797మంది, మహిళలు 2,72,672మంది ఉన్నారు. ఇతరులు 9మంది ఉన్నారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఓటర్ జాబితాను అనుసరించి తాజాగా గ్రామపంచాయతీ ఓటర్ జాబితాను అధికారులు సిద్ధం చేశారు.
News February 8, 2025
మనీశ్ సిసోడియా ఓటమి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738998104744_653-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్‌కు షాక్ తగిలింది. ఆ పార్టీ కీలక నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా ఓడిపోయారు. జంగ్‌పుర నుంచి పోటీ చేసిన ఆయనపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ విజయం సాధించారు.