News February 13, 2025

జగిత్యాల: మాటలకే పరిమితం కావొద్దు: MLC జీవన్ రెడ్డి

image

రాజకీయ పార్టీ నాయకులు మాటలకు పరిమితంగా కాకూడదని, చేతల్లో నిరూపించాలని కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలోని ఇందిరా భవన్‌లో ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌తో కలిసి గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ మత విద్వేషాలను రెచ్చగొట్టే పని చేయకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వచ్చేలా సహకరించాలని కోరారు. రిజర్వేషన్లను మతంతో ముడిపెట్టడం సరికాదన్నారు.

Similar News

News February 14, 2025

రామగుండం: BRS వాళ్లు ఓర్వడం లేదు: MLA

image

దేశం మొత్తం గర్వపడేలా తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేయబోతున్నామని రామగుండం MLA మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఇటు రాష్ట్రంలో BRS.. అటు దేశంలో BJPబీసీలను, బహుజనులను హీనంగా చూసిన చరిత్ర ప్రజలందరికీ తెలుసని మండిపడ్డారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంటే BRSవాళ్లు ఓర్వడం లేదని, అందుకే గగ్గోలు పెడుతూ కపట ప్రేమను కురిపిస్తున్నారని ఫైర్ అయ్యారు.

News February 14, 2025

MNCL: బురద గుంటలో పడి వ్యక్తి మృతి

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్‌లో గురువారం బురద గుంటలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని సీఐ ప్రమోద్ రావు తెలిపారు. మృతుని వయస్సు 60 ఏళ్లు ఉంటుందన్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ గదికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712656534 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.

News February 14, 2025

చిన్నారెడ్డి పుదుచ్చేరి సెంటిమెంట్.!

image

రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి గతంలో పుదుచ్చేరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న సమయంలో ఎన్నికలలో పార్టీ గెలుపొంది అధికారం చేపట్టింది. దీంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు చిన్నారెడ్డిని సెంటిమెంట్‌గా భావిస్తారు. పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో HYDలోని ప్రజాభవన్‌లో ఆ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి కందస్వామి చిన్నారెడ్డితో భేటీ అయ్యారు. 

error: Content is protected !!