News February 4, 2025

జగిత్యాల: యాక్సిడెంట్.. బ్యాంక్ ఉద్యోగి మృతి

image

గొల్లపల్లి చిల్వకోడూరు వద్ద కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్‌ DCRBలో పనిచేస్తున్న <<15356057>>ఎస్‌ఐ శ్వేత మృతిచెందిన<<>> విషయం తెలిసిందే. బైక్‌పై ఉన్న వ్యక్తి మల్యాల మండలం ముత్యంపేటకు చెందిన మల్యాల నరేశ్(28)గా పోలీసులు గుర్తించారు. మృతుడు మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘుచందన్ చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు.

Similar News

News March 14, 2025

బిక్కనూర్: రేపటి నుంచి సిద్ధిరామేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాలు

image

బిక్కనూర్ మండల కేంద్ర శివారులోని ఉన్న దక్షిణ కాశీగా, పిలువబడే శ్రీ సిద్ధిరామేశ్వర ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ఈనెల 19వ తేదీ వరకు కొనసాగుతాయని ఆలయ కార్యనిర్వాహణ అధికారి పద్మ శ్రీధర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు, వచ్చే భక్తుల కోసం సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఆయన కోరారు. 

News March 14, 2025

కృష్ణా: రేపు జిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలు

image

కృష్ణాజిల్లా పరిషత్ స్థాయీ సంఘ సమావేశాలను ఈనెల 15వ తేదీన నిర్వహించనున్నట్టు సీఈఓ కన్నమ నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుంచి 7 స్థాయీ సంఘ సమావేశాలు జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక, ఆయా స్థాయీ సంఘ ఛైర్మన్ల అధ్యక్షతన మచిలీపట్నంలోని జడ్పీ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి జరుగుతాయని తెలిపారు. 

News March 14, 2025

ఈ నెల 19న యూకే పార్లమెంటులో చిరుకు అవార్డు

image

మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ఈ నెల 19న యూకే పార్లమెంటులో ఆయనకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందజేయనున్నారు. కల్చరల్ లీడర్‌షిప్‌తో ప్రజాసేవకు కృషి చేసినందుకు గానూ ఈ పురస్కారంతో సన్మానించనున్నారు.

error: Content is protected !!