News March 26, 2024

జగిత్యాల: రెండు కుటుంబాల్లో చిచ్చుపెట్టిన హోలీ వేడుకలు

image

హోలీ వేడుకలు రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీశాయి. జగిత్యాల జిల్లా తిప్పన్నపేట గ్రామంలో హోలీ వేడుకలో యువకుడు విసిరిన కోడిగుడ్డు పక్కింటిపై పడటంతో వివాదం జరిగింది. కోడిగుడ్డు విసిరిన ప్రకాష్ అనే యువకుడుని పక్కింట్లో ఉండే రమ ప్రశ్నించడంతో ప్రకాష్ కొడవలితో దాడికి దిగాడు. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రమను స్థానికులు జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.

Similar News

News January 10, 2025

రామగుండం: పండగకు ఊరెళ్తున్నారా.. జర జాగ్రత్త: సీపీ శ్రీనివాస్

image

సంక్రాంతి పండుగకి ఊరికెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని సీపీ శ్రీనివాస్ పలు సూచనలు చేశారు. లొకేషన్, ట్రావెల్స్ ప్లాన్స్, ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనే విషయాలను సోషల్ మీడియాలో అప్‌డేట్ చేయవద్దని చెప్పారు. స్వీయ రక్షణకు ఇంట్లో సీసీ కెమెరా అమర్చుకుంటే మంచిదన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే స్థానిక పోలీసులకి, డయల్ 100కి సమాచారం అందించాలని సూచించారు.

News January 10, 2025

KNR: వసతి గృహాలను అధికారులు ప్రతినిత్యం పరిశీలించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ వసతి గృహాలను ప్రత్యేక అధికారులు నిత్యం క్షేత్రస్థాయి సందర్శించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎంఈవోలు కూడా హాస్టల్లో భోజనాల తయారీ తీరును పరిశీలించాలన్నారు. నూతన కామన్ మెనూ అమలు కోసం ఇంకా ఏమైనా వంట పాత్రలు వంటివి కావాలంటే అందిస్తామని తెలిపారు. హాస్టల్లో మరమ్మతులు పూర్తి చేయాలన్నారు.

News January 9, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ రేపటినుండి కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు. @ జగిత్యాల జిల్లాలో బిజెపి మండల నూతన అధ్యక్షుల నియామకం. @ పెగడపల్లి మండలంలో మెగా పశువైద్య శిబిరం. @ మల్లాపూర్ మండలంలో బావిలో పడి బాలుడి మృతి. @ కోరుట్ల మండలంలో సంపులో పడి యువకుడి మృతి. @ మానకొండూరు మండలంలో లారీ ఢీకొని యువకుడి మృతి. @ బాలుడికి ఆర్థిక సహాయం అందించిన సిరిసిల్ల కలెక్టర్.