News February 5, 2025

జగిత్యాల: శ్వేత యాక్సిడెంట్ ఘటన.. అమ్మ కోసం 100 కిలోమీటర్లు!

image

చిల్వకోడూరు వద్ద నిన్న కారు, బైక్‌ను ఢీకొన్న ఘటనలో SIశ్వేతతోపాటు <<15356623>>బ్యాంకు ఉద్యోగి నరేశ్(28)<<>> చనిపోయిన విషయం తెలిసిందే. కాగా నరేశ్‌ది నిరుపేద కుటుంబం. అతడి అన్న ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లగా అనారోగ్యంతో బాధపడుతున్న అమ్మకు తోడుగా నరేశ్ ఉండేందుకు నిత్యం సుమారు 100కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణిస్తున్నారు.రోజులానే విధులకు వెళ్లిన కొడుకు విగతజీవిగా రావడంతో ఆ తల్లి బోరున విలపించడం స్థానికులను కంటతడి పెట్టించింది.

Similar News

News February 5, 2025

NTR: APSFLలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల

image

విజయవాడలోని ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్(APSFL) కార్యాలయం నుంచి 2 పోస్టుల భర్తీకి బుధవారం ప్రకటన విడుదలైంది. ఈ మేరకు APFSL పరిధిలో ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ సీఈఓ, APFSLలో PRO పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలకు https://apsfl.in/careers.php అధికారిక వెబ్‌సైట్ చూడవచ్చని, అభ్యర్థులు తమ దరఖాస్తులను apsfl@ap.gov.in మెయిల్ ద్వారా పంపాలని APFSL అధికారులు పేర్కొన్నారు.

News February 5, 2025

రాష్ట్రంలో ఠారెత్తిస్తున్న ఎండలు

image

TG: రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో 32 నుంచి 36 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతూ వేసవిని తలపిస్తోంది. వాతావరణంలో తేమశాతం తగ్గడంతో ఎండలు కాస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరో వారంపాటు ఇవే ఉష్ణోగ్రతలు ఉంటాయని అంచనా వేసింది. మరోవైపు హైదరాబాద్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. మీ ఏరియాలో ఎండలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

News February 5, 2025

గుంటూరులో వైద్యం వికటించి చిన్నారి మృతి

image

లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని చౌత్రాడౌన్‌లో అంజుమ్ అనే చిన్నారి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం వికటించి మరణించిందని బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. జలుబుతో ఇబ్బంది పడుతుందని చిన్నారిని ఆసుపత్రిలో చూపించడానికి వస్తే ఇలా జరిగిందని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమౌతున్నారు. లాలాపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!