News April 9, 2024
జగిత్యాల: హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అశోక్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు మల్టీజోన్ ఐజి రంగనాథ్ సోమవారం అతడిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్లో మద్యం సేవించారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు విచారణ జరిపి సస్పెండ్ చేసినట్లు సమాచారం. ఇదే ఆరోపణలతో ఇటీవల ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.
Similar News
News October 9, 2024
తంగళ్లపల్లి: మూడు ప్రభుత్వ కొలువులు సాధించిన యువకుడు
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకి చెందిన దాసరి ప్రశాంత్ 2020లో జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా జాబ్ సాధించాడు. విధులు నిర్వహిస్తూనే రైల్వే గ్రూప్ డీ, ఎస్జీటీ టీచర్, TGPSC గ్రూప్4 మూడు ఉద్యోగాలు ఒకేసారి సాధించాడు. సొంత నోట్స్, రోజు ప్రిపరేషన్ వల్ల తను సక్సెస్ కాగలిగానని ప్రశాంత్ తెలిపాడు. ఒకేసారి మూడు ఉద్యోగాలు సాధించిన ప్రశాంత్‌ను పలువురు గ్రామస్థులు అభినందించారు.
News October 9, 2024
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు
జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.1,44,849 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,00,714, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.27,915, అన్నదానం రూ.16,220,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.
News October 9, 2024
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్
@ వేములవాడలో వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు. @ వేములవాడ బతుకమ్మ వేడుకలలో పాల్గొన్న ఆది శ్రీనివాస్, బండి సంజయ్. @ ఇల్లంతకుంట మండలంలో అంబులెన్స్ బోల్తా ఇద్దరికీ తీవ్ర గాయాలు. @ కేశవపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ. @ హిజ్రాలకు కౌన్సిలింగ్ ఇచ్చిన మల్యాల ఎస్ఐ. @ మెట్ పల్లి మండలంలో అంగన్వాడీల బతుకమ్మ సంబరాలు.