News March 7, 2025

జగ్గంపేట: మృతిచెందిన యువతి వివరాలు ఇవే..

image

ఏలూరు రోడ్డు ప్రమాదంలో జగ్గంపేటకు చెందిన మిట్టపర్తి భవాని (23) మృతి చెందింది. ఆమె స్వగ్రామం జగ్గంపేట మండలం కాట్రావులపల్లి. హైదరాబాదులో ఉద్యోగం చేస్తోంది. బుధవారం రాత్రి హైదరాబాద్ నుంచి కాట్రావులపల్లి వస్తుండగా గురువారం తెల్లవారు జామున ప్రమాదంలో మృతి చెందింది. ఆమెకు ఇంకా వివాహం కాలేదు. ఆమె మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Similar News

News March 9, 2025

NGKL: SLBC టన్నెల్‌లో మృతదేహాల కోసం ప్రయత్నం

image

దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు సజీవ సమాధి అయినట్లు తెలుస్తోంది. వారి మృతదేహాలను వెలికి తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఓ వ్యక్తి మృతదేహాన్ని వెలికి తీసినప్పటికీ అతనికి సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. ఆ మృతదేహం పక్కనే మరో రెండు మృతదేహాలు ఉన్నప్పటికీ వాటిని వెలికి తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

News March 9, 2025

విజయశాంతికి ఎమ్మెల్సీ టికెట్

image

TG: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించింది. విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ పేర్లను ప్రకటించింది. ఒక మహిళ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ అభ్యర్థికి అవకాశం కల్పించింది. నాలుగు స్థానాల్లో ఒకటి సీపీఐకి ఇచ్చిన సంగతి తెలిసిందే.

News March 9, 2025

నల్గొండ: తండ్రి అంతిమ సంస్కారాలు చేసిన కుమార్తె

image

నల్గొండ జిల్లా నకిరేకల్‌లో సీపీఐ ఎంఎల్ జనశక్తి సీనియర్ నాయకులు చిట్టూరి సోమయ్య అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుమార్తె తెలంగాణ ఉద్యమ సారథి కళాకారిణి పల్స నిర్మల అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సోమయ్యకు ఒక్కరే సంతానం కావడంతో అన్నీ తానై తన తండ్రి అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ విమలక్కతో పాటు కళాకారులు ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. సోమయ్య మృతితో నకిరేకల్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

error: Content is protected !!