News March 18, 2024
జనగాం: పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన దూల్మిట్ట మండలంలో జరిగింది. మద్దూరు ఎస్సై షేక్ యూనస్ అహ్మద్ అలీ తెలిపిన వివరిలిలా.. కూటిగల్ గ్రామానికి చెందిన తిగుళ్ల రమేశ్ (21) జీవితంపై విరక్తి చెంది వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగాడు. ఇది గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ దవాఖానాకు తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు ఆయన తెలిపారు.
Similar News
News April 17, 2025
వరంగల్: నేటి నుంచి భూభారతిపై అవగాహన సదస్సు: కలెక్టర్

వరంగల్ జిల్లాలో రైతులకు, ప్రజలకు భూ భారతి చట్టంపై ఈనెల 17 నుంచి 30 వరకు రోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకు మండల కేంద్రాల్లో అవగాహన సమావేశాలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి అన్నారు. కొత్త ఆర్ఆర్ చట్టం అమలుపై సమగ్రంగా అధికారులు వివరిస్తారని, ప్రజలకు ఏలాంటి సందేహాలు ఉన్నా నివృత్తి చేసుకోవచ్చనని సూచించారు.
News April 17, 2025
నర్సంపేట: అయ్యో.. పండ్ల రైతులకు ఎంత కష్టమచ్చెనే!

పండ్ల సాగుతో కాసుల పంట పండిద్దామనుకున్న ఉద్యాన రైతులను అకాల వర్షాలు నట్టేట ముంచాయి. నర్సంపేట డివిజన్ పరిధిలో వారం రోజుల వ్యవధిలోనే వరుస వర్షాలకు అరటి, మామిడి, బొప్పాయి ఇతర పండ్ల పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. నల్లబెల్లి, నర్సంపేట మండలాల్లో మామిడి, దుగ్గొండి, నర్సంపేటలో అరటి తోటలు పదుల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. 80 ఎకరాల్లో పంట నష్టాన్ని ఉద్యాన అధికారులు గుర్తించి ప్రభుత్వానికి నివేదించారు.
News April 17, 2025
స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులు పూర్తి చేయండి: మేయర్

వేగవంతంగా స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో ఇండోర్ స్టేడియం ప్రాంతంలో సుమారు రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న స్విమ్మింగ్ ఫూల్ నిర్మాణ పనులను మేయర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు కొనసాగుతున్న తీరు పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యం సరికాదన్నారు.