News April 3, 2025

జనగాం యువతకు కలెక్టర్ సూచనలు

image

యువత రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగించుకోవాలన  కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువత ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని, ఆసక్తి గల వారు ఆన్‌లైన్‌లో https://tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ధ్రువపత్రాలను ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సహాయ కేంద్రంలో అందజేయాలన్నారు.

Similar News

News April 10, 2025

శ్రీ సీతారాముల కళ్యాణానికి కోటి తలంబ్రాలు సమర్పణ

image

ఒంటిమిట్టలో శుక్రవారం జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం అధ్యక్షుడు కళ్యాణ అప్పారావు ఆధ్వర్యంలో గోటితో ఒలిచిన కోటి తలంబ్రాలను సమర్పించారు. మొత్తం 120 కిలోల బరువైన ఈ తలంబ్రాలను ఆలయం వద్ద సూపరింటెండెంట్‌ హనుమంతయ్య, అర్చకులు శ్రావణ్ కుమార్ సమక్షంలో అందించారు.

News April 10, 2025

‘అమ్మ నన్ను చంపేస్తోంది’.. అని మెసేజ్ చేసి..

image

AP: తిరుపతి(D) చంద్రగిరి(M)లో బాలిక అనుమానాస్పద<<16045416>>మృతిపై <<>>ఆమె ప్రియుడు అజయ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ‘మూడేళ్లు ప్రేమించుకుని గతేడాది పెళ్లి చేసుకున్నాం. ఆమె పేరెంట్స్ నాపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపారు. గర్భం దాల్చిన బాలికకు అబార్షన్ చేయించారు. విషం పెట్టి వాళ్ల అమ్మ, మామ, తాత చంపాలని చూస్తున్నారని ఆమె మెసేజ్ చేసింది. తర్వాతి రోజే చనిపోయింది’ అంటూ బాలికతో చేసిన చాటింగ్‌ను పంచుకున్నాడు.

News April 10, 2025

మరో క్రేజీ స్పేస్ మిషన్

image

జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూఆరిజన్ కంపెనీ మరో క్రేజీ స్పేస్ మిషన్‌(NS-31)కు సిద్ధమవుతోంది. ఆరుగురు మహిళా వ్యోమగాములతో కూడిన రాకెట్ టెక్సాస్ నుంచి APR 14న నింగిలోకి దూసుకెళ్లనుంది. 100KM ఎత్తులో ఉన్న కర్మాన్ లైన్(భూమి వాతావరణానికి, స్పేస్‌కు మధ్య ఉన్న ప్రాంతం) 11 నిమిషాల్లో వెళ్లనుంది. ఈ ప్రయాణంలో వెయిట్ లెస్ పరిస్థితులు, భూమి అందాలను వీక్షించిన అనంతరం వారు పారాచూట్ల సాయంతో భూమిపైకి రానున్నారు.

error: Content is protected !!