News February 26, 2025
జనగామ: అన్ని పాఠశాలలకు జిల్లా అధికారి ఆదేశాలు

ఈనెల 28న జనగామ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించాలని జిల్లా సైన్స్ అధికారి ఉపేందర్ మంగళవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. సైన్స్ ప్రాముఖ్యతను తెలిపేలా వివిధ రకాల పోటీలను నిర్వహించాలని ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు పేరెంట్స్ కమిటీ ప్రోత్సాహంతో బహుమతులు అందజేయాలని సూచించారు. వివరాలకు 9441453662 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
Similar News
News February 26, 2025
ఆన్‌లైన్‌లో నిర్మాణ అనుమతులు: HYD మేయర్

ఫాస్ట్ డ్రాయింగ్ స్క్రూటినీ సిస్టమ్ కోసం అధునాతన సాంకేతికతతో కూడిన యూనిఫైడ్ సింగిల్ విండో సిస్టమ్ బిల్డ్స్ అందుబాటులోకి తెస్తున్నామని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. ఈమేరకు జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆర్కిటెక్చర్, ఇంజినీర్లకు బిల్డ్స్ డీసీఆర్‌పై ఏర్పాటు చేసిన శిక్షణను కమిషనర్ ఇలంబర్తితో కలిసి ఆమె ప్రారంభించారు. ఆన్‌లైన్‌లోనే తమ నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
News February 26, 2025
వరంగల్: ఆ రూట్ బస్ ఛార్జీలపై సబ్సిడీ

ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి బెంగళూరుకు వెళ్లే ప్రయాణికులకు ఆర్టీసీ బస్సు ఛార్జీలపై సబ్సిడీ ప్రకటించింది. హనుమకొండ నుంచి బెంగళూరుకు వెళ్లే అన్ని ఏసీ, సూపర్ లగ్జరీ బస్ టికెట్లపై 10 శాతం ధరలు తగ్గించారు. దీంతో రాయితీ అనంతరం టికెట్ ధరలు ఇలా ఉన్నాయి. ఏసీ స్లీపర్ బెర్త్ టికెట్ రూ.1770, ఏసీ టికెట్ రూ.1380, సూపర్ లగ్జరీ రూ.1000గా ఉంటుంది.
News February 26, 2025
వనపర్తి జిల్లాలో బాలికపై లైంగిక వేధింపులు

వనపర్తిలో అమానవీయ ఘటన జరిగింది. పోలీసుల వివరాలు.. పట్టణానికి చెందిన బాలిక తండ్రికి ప్రశాంత్ అనే స్నేహితుడున్నాడు. గత ఏడాది JUNEలో యువకుడు స్నేహితుడి కూతురిని వివస్త్రను చేసి, ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పటినుంచి బాలిక ముభావంగా ఉంటోంది. దీంతో తల్లి నిలదీయగా విషయం చెప్పింది. భర్త పట్టించుకోకపోవడంతో పుట్టింటికి వచ్చి మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మంగళవారం కేసు నమోదైంది.