News February 26, 2025
జనగామ: ఇంటర్‌లో మంచి ఫలితాలు సాధించాలి: డీఐఈవో

రానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని డీఐఈఓ జితేందర్ రెడ్డి అన్నారు. జనగామలోని ధర్మకంచెలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం వీడ్కోలు సమావేశం కళాశాల ప్రిన్సిపల్ పావని అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఉత్తమ ఫలితాలు సాధించడమే కాకుండా ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.
Similar News
News February 26, 2025
పార్వతీపురం జిల్లాలో ఎంత మంది MLC ఓటర్లు ఉన్నారంటే..!

పార్వతీపురం మన్యం జిల్లాలో ఈనెల 27న జరగనున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో 2,333 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ఇందులో 1,574 మంది పురుషులు 759 మంది మహిళలు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఎన్నికల విధుల కోసం 18 మంది పిఓలు, 18 మంది ఏపీవోలు, 36 మంది ఓపిఓలు, 18 మంది ఏవోలను నియమించినట్లు చెప్పారు.
News February 26, 2025
విశాఖలో దారి దోపిడీ ముఠా అరెస్ట్

విశాఖలో దారి దోపిడీ ముఠాను త్రీటౌన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఫిషింగ్ హార్బర్ వద్ద ఫిబ్రవరి 22న ఉదయం మైలపల్లి చందర్రావు అనే వ్యక్తిని ముగ్గురు బైక్‌పై వచ్చి అడ్డుకున్నారు. అతని నుంచి రూ.350 నగదు, సెల్ ఫోన్ తీసుకొని తోసేసి వెళ్లిపోయారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు గాలించారు. నిందితులు తీడా మోనేష్ బాబు(19), మరో ఇద్దరు మైనర్ యువకుల(17)ను అరెస్ట్ చేసి జువెనైల్ హోం, రిమాండ్‌కు తరలించారు.
News February 26, 2025
27న విద్యాసంస్థలకు సెలవు: డీఈఓ

ఉమ్మడి గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు గురువారం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వ పాఠశాల విద్యా కమిషనర్ సెలవు ప్రకటించినట్లు డీఈఓ వాసుదేవరావు తెలిపారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని ఉప విద్యాశాఖ అధికారులకు, ఎంఈఓలు, అన్ని విద్యా సంస్థలకు దీనిపై సర్క్యులర్ అందించినట్లు వివరించారు.