News April 5, 2025
జనగామ: ఉపాధి హామీ సిబ్బందిని అభినందించిన కలెక్టర్

ఉపాధి హామీ పథకం ద్వారా 2024-25 సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యానికి మించి పనిచేస్తున్న ఉపాధి హామీ సిబ్బందిని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, రాష్ట్రస్థాయి అధికారులు అభినందించారు. జిల్లాలో 30 లక్షల 57 వేల పని దినాలు కాగా 30 లక్షల 97 వేల 108 పని దినాలు కల్పించారు. రోజు కూలి దినాల సంఖ్య పరంగా రాష్ట్రంలో నాలుగు స్థానంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News April 5, 2025
ప్రతి ఇంట్లో వ్యాపారవేత్త ఉండాలి : నెల్లూరు మంత్రి

2047 నాటికి ప్రతి ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఉండాలని మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. విజయవాడలో జరిగిన మెప్మా వన్ డే వర్క్ షాప్‌లో ఆయన పాల్గొన్నారు. మహిళాకాశం పేరిట మెప్మా వెబ్ సైట్, మెప్మా మొబైల్ యాప్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ ఆర్థిక సంవత్సరం 30 వేల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారుచేయడమే మెప్మా లక్ష్యమని తెలిపారు. ఈ వర్క్ షాపులో నారాయణతో పాటు మెప్మా డైరెక్టర్ తేజ్ భరత్ పాల్గొన్నారు.
News April 5, 2025
ఉమ్మడి జిల్లాల నేతలతో KCR సమావేశం

TG: ఇటీవల పలు జిల్లాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న BRS చీఫ్ కేసీఆర్ తాజాగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. ఎర్రవెల్లి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభ నిర్వహణలపై వారితో చర్చిస్తున్నారు. సభ నిర్వహణ, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ప్రజలను తరలించడం సహా పలు అంశాలపై నేతలతో మాజీ సీఎం సమాలోచనలు చేస్తున్నారు.
News April 5, 2025
అశ్లీల వీడియోలు చూసి షేర్ చేస్తున్నారా?

అశ్లీల వీడియోలను చూడటం, షేర్ చేయడం నేరమని TG పోలీసులు హెచ్చరించారు. యువత పోర్నోగ్రఫీకి దూరంగా ఉండాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ చూడొద్దని సూచించారు. సోషల్ మీడియాను మంచికోసం వాడుకోవాలని, అశ్లీల వీడియోలను పోస్ట్ & షేర్ చేసేవారిపై నిఘా ఉంచినట్లు పేర్కొన్నారు. తాజాగా సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ యువకుడు బాలల అశ్లీల సన్నివేశాలను పంపినందుకు అరెస్ట్ అయినట్లు తెలిపారు.