News March 25, 2025

జనగామ: ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణను పరిశీలించిన కలెక్టర్

image

జనగామ పురపాలిక పరిధిలో నిర్వహిస్తోన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల ప్లాట్‌ల క్రమబద్ధీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించారు. ఈసందర్భంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల ప్లాట్ ప్లాట్‌ల ఆన్‌లైన్ నిశితంగా పర్యవేక్షించి, సంబంధిత వివరాలను అడిగి తెలుసుకొని, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎల్ఆర్ఎస్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారు పూర్తిస్థాయి రుసుమును చెల్లించాలన్నారు. 

Similar News

News March 29, 2025

భర్త చేతిలో భార్య దారుణ హత్య

image

ఉమ్మడి కర్నూలు జిల్లా వెలుగోడు మండలం మోత్కూర్ గ్రామం మజార తిమ్మనిపల్లిలో భార్యను భర్త హత్య చేశాడు. పశువుల లక్ష్మీదేవి(35)ని భర్త చిన్న మధుకృష్ణ శుక్రవారం మధ్యాహ్నం గొడ్డలితో తలపై కొట్టగా బలమైన గాయమై అక్కడికక్కడే మృతిచెందింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

News March 29, 2025

BREAKING: మరో దేశంలో భూకంపం

image

మయన్మార్, బ్యాంకాక్ దేశాల్లో సంభవించిన భారీ భూకంపాన్ని మరువకముందే మరో దేశంలో భూమి కంపించింది. అఫ్గాన్‌లో 4.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. ఇవాళ ఉ.5.16 గంటలకు భూమి కంపించినట్లు తెలిపింది. తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగి ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే వరుస భూకంపాలతో మయన్మార్, థాయ్‌లాండ్, భారత్‌, చైనా తదితర దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

News March 29, 2025

కొత్త సినిమాల సీక్వెల్స్, ప్రీక్వెల్స్ టైటిల్స్ ఇవే!

image

ఈవారం 4 సినిమాలు రిలీజవగా వీటి సీక్వెల్స్, ప్రీక్వెల్స్‌ను మేకర్స్ ప్రకటించారు. నిన్న రిలీజైన ‘మ్యాడ్ స్క్వేర్’కు సీక్వెల్ ‘మ్యాడ్ క్యూబ్’ ఉండనుంది. హీరో నితిన్ నటించిన ‘రాబిన్‌హుడ్’ సినిమాకు సీక్వెల్ ‘బ్రదర్‌హుడ్ ఆఫ్ రాబిన్‌హుడ్’ ఉంటుందని హింట్ ఇచ్చారు. మోహన్‌లాల్ నటించిన ‘L2: ఎంపురాన్’కు కొనసాగింపుగా ‘L3: ది బిగినింగ్’, విక్రమ్ హీరోగా వచ్చిన ‘వీర ధీర శూర’కు ప్రీక్వెల్‌గా పార్ట్-1 రానుంది.

error: Content is protected !!