News February 2, 2025
జనగామ: గురుకులాల్లో ప్రవేశాలకు గడువు పొడిగింపు
జనగామ జిల్లాలోని బీసీ సంక్షేమ గురుకులాల్లో 5 నుంచి 9వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు బీసీ సంక్షేమ గురుకులాల డీసీఓ శ్రీనివాస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 6 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Similar News
News February 2, 2025
అచ్చంపేట: బాలికపై బాబాయి అత్యాచారయత్నం.. కేసు నమోదు
నాగర్‌కర్నూల్ జిల్లాలో బాలికపై బాబాయి అత్యాచారానికి యత్నించిన ఘటనపై కేసు నమోదైంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. అచ్చంపేట మండలంలోని ఓ తండాలో మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన సొంత బాబాయి(యువకుడు) అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు అచ్చంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
News February 2, 2025
ADB రిమ్స్ ఆసుపత్రిలో NCD క్లినిక్‌ను ప్రారంభించిన కలెక్టర్
అసాంక్రమిక వ్యాధులచే బాధపడుతున్న రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించుటకు ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో NCD క్లినిక్ ను కలెక్టర్ రాజర్షిషా ప్రారంభించారు. అనంతరం రోగులను పరీక్షించే గది, వ్యాధిగ్రస్తులకు సేవలు అందించే గదులను ఆయన సందర్శించారు. NCD క్లినిక్‌లో అసాంక్రమిక వ్యాధులతో (రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ మొదలైనవి) వాటితో బాధపడుతున్న వ్యాధిగ్రస్థులకు అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
News February 2, 2025
ఢిల్లీ ఎన్నికల్లో విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రచారం
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఢిల్లీలోని షాలిమార్ ప్రాంతంలో ఆయన తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే కాలనీలో ప్రచారం చేశారు. ఆయన వెంట పలువురు బీజేపీ నాయకులు ఉన్నారు. బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన ఆటోలో ప్రయాణించారు.