News February 21, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి: అడిషనల్ కలెక్టర్
> జిల్లా వ్యాప్తంగా ఘనంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు
> ఓవర్ లోడుతో వెళ్తున్న వాహనాన్ని సీజ్ చేసిన రవాణా అధికారులు
> ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికలపై జిల్లా కలెక్టరేట్లో సమావేశం
> తేనెటీగల దాడిలో గీత కార్మికుడికి తీవ్ర గాయాలు
> పాలకుర్తి శ్రీ సోమేశ్వర ఆలయ ప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేసిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్

Similar News

News February 22, 2025

బంతులా?.. బుల్లెట్లా?

image

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ CTలో భాగంగా ఇవాళ ఆసీస్‌పై బంతులతో నిప్పులు చెరిగారు. తొలి నాలుగు ఓవర్లలో కేవలం రెండు బంతులే 150Kmph కంటే తక్కువ వేగంతో వేశారు. మిగతా బాల్స్ అన్నీ 150Kmph కంటే వేగంగా సంధించాడు. ఇందులో వేగవంతమైన బంతి స్పీడ్ 153.5Kmph. ఇంతటి వేగంలోనూ చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌లో బాల్స్ వేయడంతో ఆసీస్ బ్యాటర్లు స్కోర్ చేసేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే వుడ్ ఓ వికెట్ తీశారు.

News February 22, 2025

MLC ఎన్నికల్లో విజయం బీజేపీదే: బండి సంజయ్

image

రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కామారెడ్డిలో పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం శనివారం నిర్వహించారు. కమిట్‌మెంట్‌తో పని చేస్తే పార్టీ క్యాడర్ బీజేపీకే సొంతం అవుతుందని ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు. ముఖ్యంగా 317 జీవోకు వ్యతిరేకంగా టీచర్ల సమస్యలపై మొదటి నుంచి పోరాడుతున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని తెలిపారు.

News February 22, 2025

గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథాతథం: కలెక్టర్ 

image

నెల్లూరులో రేపు(ఆదివారం) గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఉదయం 10 నుంచి 12.30 వరకు పేపర్-1 పరీక్ష, మధ్యాహ్నం 3 నుంచి 5.30 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుందని ఆయన తెలిపారు. అభ్యర్థులు 15 నిమిషాలు ముందే పరీక్షా కేంద్రానికి రావాలని కోరారు. 

error: Content is protected !!