News March 15, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> జిల్లా వ్యాప్తంగా సిపిఎం నేతల ధర్నా > రైలు కిందపడి యువకుడు మృతి > ప్రభుత్వంపై పోరాటం చేస్తాం జనగామ ఎమ్మెల్యే > రేపటి సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే కడియం > ప్రశాంతంగా ఎనిమిదవ రోజు ఇంటర్ పరీక్షలు > కొమురవెల్లికి బస్సులు లేక ప్రయాణికుల ఇక్కట్లు > 5వ రోజుకు చేరుకున్న ఎమ్మార్పీఎస్ నేతల నిరాహార దీక్ష > హామీలను నెరవేర్చిన తర్వాతే సీఎం జిల్లాలో అడుగు పెట్టాలి: రమేష్

Similar News

News March 18, 2025

హైడ్రా పేరుతో వసూళ్ల దందా: కేటీఆర్

image

TG: హైడ్రా పేరుతో వసూళ్ల దందా నడుస్తోందని కేటీఆర్ ట్వీట్ చేశారు. మూసీ పేరుతో పేదల ఇళ్లపై పగబట్టారని ఓ న్యూస్ ఆర్టికల్‌ను షేర్ చేశారు. ఫోర్త్ సిటీ పేరుతో సీఎం కుటుంబం రియల్ వ్యాపారం చేస్తోందని విమర్శలు చేశారు. పేదలపై ప్రతాపం చూపిస్తూ పెద్దలతో ఒప్పందం చేసుకుంటారని దుయ్యబట్టారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రాన్ని పాతాళానికి తీసుకెళ్లారన్నారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలన్నారు.

News March 18, 2025

ఎంవీపీ కాలనీ: ప్రేయసికి పెళ్లయిందని యువకుడి అదృశ్యం

image

ప్రేయసికి పెళ్లయిందని ఓ యువకుడు అదృశ్యమైన ఘటన ఎంపీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతవెంకోజిపాలెంలో ఉంటున్న యువకుడు(20) ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్నాడు. తన ప్రేయసికి పెళ్లయిందని తెలిసి ఆదివారం సాయంత్రం ఇంట్లోంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News March 18, 2025

మేడిపల్లి : త్రుటిలో తప్పిన ప్రమాదం..!

image

ఉమ్మడి మేడిపల్లి మండలంలోని రైల్వేస్టేషన్‌లో ప్రమాదం తప్పింది. MDP రైల్వే స్టేషన్లో కొందరు దుండగులు ప్లాట్‌ఫారంపై  గల సిమెంట్ బెంచిని రైల్వే ట్రాక్ పై పడేశారు. దీనిని ఉదయం సమయంలో గమనించిన స్థానికులు ఆబెంచిని ట్రాక్ పై నుంచి తీశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంబంధిత అధికారులు ఇలాంటివి జరుగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు.

error: Content is protected !!