News March 20, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> ఎండిపోయిన పంట పొలాలకు రూ.25 వేలు ఇవ్వాలని దేవరుప్పులలో బీఆర్ఎస్ నేతల నిరసన, ధర్నా
> 12వ రోజు ప్రశాంతంగా కొనసాగిన ఇంటర్ పరీక్షలు
> బచ్చన్నపేట: విద్యుత్ ఘాతంతో వృద్ధురాలు మృతి
> ఏసీబీకి చిక్కిన స్టేషన్ ఘనపూర్ సబ్ రిజిస్ట్రార్
> పీసీసీ అధ్యక్షుడిని కలిసిన మాజీ ఎమ్మెల్యే
> జనగామ కలెక్టరేట్లో ఇఫ్తార్ విందు
> 100% పన్నులు వసూలు చేయాలి: కలెక్టర్
> ఎల్ఆర్ఎస్ ప్రక్రియను సజావుగా నిర్వహించాలి కలెక్టర్
Similar News
News March 28, 2025
ఇఫ్తార్ విందులో ఆనం, అజీజ్, కోటంరెడ్డి

రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కస్తూరిదేవి గార్డెన్స్‌లో శుక్రవారం రాత్రి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అజీజ్, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి, కలెక్టర్ ఆనంద్, కమిషనర్ తోపాటు ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. వారు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేశారు.
News March 28, 2025
అనకాపల్లి: వచ్చే నెల 1న సాంఘిక శాస్త్రం పరీక్ష

పదో తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రం పరీక్ష ఏప్రిల్ 1వ తేదీన నిర్వహించనున్నట్లు అనకాపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 31వ తేదీన రంజాన్ పండగ సందర్భాన్ని పురస్కరించుకుని పరీక్షను 1వ తేదీకి వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. విద్యార్థులు తల్లిదండ్రులు ఈ మార్పును గమనించాలని కోరారు.
News March 28, 2025
బాపట్ల: ‘పొగాకు రైతులకి న్యాయం చేయాలి’

బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పొగా రైతులు, వివిధ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. పలువురు రైతులు ప్రజా పరిష్కార వేదిక వద్ద బర్లీ పొగాకు రైతులకి న్యాయం చేయాలని, పంటను కొనుగోలు చేయాలని కోరారు. అనంతరం కంపెనీ ప్రతినిధులతో జాయింట్ కలెక్టర్ సమీక్షించారు.