News February 9, 2025
జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

> ప్రజావాణి కార్యక్రమం వాయిదా
> జాతీయ స్థాయి కరాటే పోటీల్లో సత్తా చాటిన స్టేషన్ ఘనపూర్ విద్యార్థులు
> షెడ్యూల్ కులాల రిజర్వేషన్ పెంచాలి: కడియం
> తప్పుడుగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని NSUI నేతల డిమాండ్
> ఘనంగా పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
> సోమేశ్వరాలయానికి అరకిలో వెండి పూర్ణకుంభం అందజేత
Similar News
News December 19, 2025
తరచూ తలనొప్పా! ఈ తప్పులు చేస్తున్నారా?

శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల మెదడు కుంచించుకుపోయి తలనొప్పి వస్తుంది. భోజనం స్కిప్ చేసినా సమస్య రావచ్చు. స్వీట్స్, పలు పిండి పదార్థాలు తిన్నప్పుడు కొందరికి ఈ ఇబ్బంది వస్తుంది. సరిగ్గా కూర్చోకపోయినా, ఎక్కువసేపు నిలబడినా కండరాలు ఒత్తిడికిగురై సమస్య రావచ్చు. పడుకునే ముందు గట్టిగా ఉన్న ఫుడ్ తిన్నా, నిద్రలో పళ్లు కొరికినా, రాత్రుళ్లు స్మోకింగ్, డ్రింకింగ్, నాణ్యతలేని నిద్ర తలనొప్పికి కారణం కావచ్చు.
News December 19, 2025
కొత్తగూడెంలో 37 సీపీఐ సర్పంచులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేస్తుంది. అధికార కాంగ్రెస్ 271, ప్రతిపక్ష బీఆర్ఎస్ 105, సీపీఐ 47, ఇతరులు 46 గ్రామపంచాయతీల్లో విజయం సాధించారు. భద్రాద్రి జిల్లాలో బీజేపీ పార్టీ ఏ ఒక్క గ్రామపంచాయతీలో పాగా వేయలేదు. కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 37 సర్పంచ్ స్థానాల్లో గెలుపొందారు.
News December 19, 2025
జుక్కల్: నాడు భార్య ఏకగ్రీవం.. నేడు భర్త ప్రభంజనం!

జుక్కల్ మండలంలోని లాడేగావ్ జీపీ ఎన్నికల్లో రాజశేఖర్ పాటిల్ భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. గత ఎన్నికల్లో ఈయన భార్య అశ్వినీ ఏకగ్రీవంగా ఎన్నికై గ్రామాభివృద్ధిలో తన ముద్ర వేశారు. ఈసారి ఎన్నికల్లో రాజశేఖర్ పాటిల్ సర్పంచి పీఠాన్ని కైవసం చేసుకొని వారి కుటుంబ నాయకత్వంపై మరోసారి నమ్మకాన్ని చాటారు. తన విజయంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.


