News March 18, 2025

జనగామ: టెన్త్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలి: కలెక్టర్

image

జనగామ జిల్లాలో పదవ తరగతి పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పింకేశ్ కుమార్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌లతో కలిసి కలెక్టర్ పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Similar News

News March 19, 2025

సన్న వడ్లకు రూ.500 బోనస్‌‌పై UPDATE

image

TG: సన్న రకం వడ్లకు రూ.500 బోనస్‌పై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన చేశారు. వానకాలం పంటకు సంబంధించి రూ.1200 కోట్ల నిధులకు ఆర్థిక శాఖ నిన్న ఆమోదం తెలిపిందని ట్వీట్ చేశారు. దీంతో త్వరలోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. సన్నరకం వరి ధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. డబ్బులు ఎప్పుడు జమ అవుతాయా అని రైతులు ఎదురుచూస్తున్నారు.

News March 19, 2025

పెద్దేముల్ మండలంలో తెల్లవారుజామున హత్య

image

పెద్దేముల్ మండలంలోని హన్మాపూర్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున హత్య జరిగింది. గ్రామానికి చెందిన బక్కని వెంకటేష్‌ను హత్య చేసినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హన్మాపూర్ వరుస హత్యలు కలవర పెడుతున్నాయి.

News March 19, 2025

హిందూపురం వ్యక్తి దారుణ హత్య

image

శ్రీ సత్యసాయి జిల్లా మలుగూరు సమీపంలో హిందూపురానికి చెందిన సద్దాం(35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన జరగగా.. బుధవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. హిందూపురం రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

error: Content is protected !!