News April 3, 2025

జనగామ: దరఖాస్తుల ఆహ్వానం 

image

మహాత్మ జ్యోతిబాఫూలే విదేశీ విద్యా నిధి (బీసీ ఓవర్సీస్) పథకం కింద జిల్లాలోని బీసీ, ఈ బీసీ విద్యార్థులు విదేశాలలో చదువుకై దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రవీందర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 30వ తేదీ వరకు అప్లై చేసుకోవాలన్నారు. వివరాలకు www.telanganaepass.cgg.gov వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.

Similar News

News April 4, 2025

CS శాంతి కుమారికి రైతు కమిషన్ వినతి

image

ములుగు జిల్లాలో నకిలీ మొక్కజొన్న విత్తనాలతో గిరిజన రైతులకు జరిగిన నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, రైతు హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే చట్ట సవరణలు చేయాలని రైతు కమిషన్.. CS శాంతి కుమారికి నివేదిక అందించింది. వ్యవసాయ మార్కెట్, విత్తన చట్టాల్లో మార్పులు, నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వ్యవసాయ శాఖ పేరులోనూ మార్పులు కోరింది.

News April 4, 2025

ఈ నెల 16 నుంచి స్టీల్ ప్లాంట్ కార్మికుల సమ్మె

image

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అఖిలపక్ష కార్మిక సంఘాలు మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నాయి. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపునకు నిరసనగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ నెల 7, 8 తేదీల్లో యాజమాన్యంతో చర్చిస్తామని, సానుకూలంగా స్పందించకపోతే 16 నుంచి విధులు బహిష్కరిస్తామని ప్రకటించాయి. రేపు సాయంత్రం ఫ్యాక్టరీ ఆర్చ్ వద్ద రాస్తారోకో చేస్తామని తెలిపాయి. త్వరలో ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతిపత్రాలు ఇస్తామని పేర్కొన్నాయి.

News April 4, 2025

శ్రీలంకలో అడుగుపెట్టిన మోదీ

image

ప్రధాని మోదీ థాయ్‌లాండ్ పర్యటన ముగించుకుని శ్రీలంకకు చేరుకున్నారు. ఆయనకు కొలంబో ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఈ ద్వీప దేశ అధ్యక్షుడిగా అనుర కుమార దిస్సనాయకే బాధ్యతలు స్వీకరించాక మోదీ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి. 3 రోజుల విజిట్‌లో రక్షణ, ఇంధన, హెల్త్, వాణిజ్య రంగాలపై ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది.

error: Content is protected !!