News April 18, 2024
జనగామ: ‘బిల్లు ఇవ్వకపోతే చనిపోతా’

మాజీ సర్పంచి విడుదల చేసిన ఓ ప్రకటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంకి చెందిన మాజీ సర్పంచి శ్రీధర్ రూ.15 లక్షల అప్పు చేసి RWS అధికారులు, పంచాయితీ తీర్మానంతో గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ బాగుచేయించాడు. అయితే తన పదవీకాలం ముగిసినా MB రికార్డు చేయలేదని, అధికారులు పట్టించుకోవడంలేదన్నారు. ‘బిల్లులు ఇవ్వకపోతే సూపైడ్ చేసుకుంటానంటూ’ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Similar News
News April 21, 2025
WGL: TGSRTCలో జాబ్స్.. ప్రిపరేషన్‌కు READY

TGSRTCలో 3,038 పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రకటించడంతో WGL,HNK,JN,MHBD,BHPL,MLGలో నిరుద్యోగులు ప్రిపరేషన్‌కు రెడీ అవుతున్నారు. డ్రైవర్లు-2,000, శ్రామిక్-743, డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానికల్-114, ట్రాఫిక్- 84), DM/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ -25,అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్-18,సివిల్-23, సెక్షన్ ఆఫీసర్-11, అకౌంట్స్ ఆఫీసర్-6,మెడికల్ ఆఫీసర్స్ (జనరల్-7, స్పెషలిస్టు-7) పోస్టులు ఉన్నాయి.
News April 21, 2025
వరంగల్: మూడు జిల్లాల్లో విస్తరించిన ‘పాకాల’

పాకాల అభయారణ్యం అంటే ఒక్క వరంగల్ జిల్లానే అనుకుంటారు. నిజానికి పాకాల అడవి 839చ.కి.మీ విస్తీర్ణంతో వరంగల్‌తో పాటు మహబూబాబాద్, ములుగు జిల్లాలోనూ విస్తరించి ఉంది. వివిధ రకాల జంతువులు, పక్షులు, సరీసృపాలకు అనువైనదిగా ఉంది. శీతాకాలంలో విదేశీ పక్షులు సైతం ఇక్కడ సందడి చేస్తాయి. నర్సంపేటకు 9 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాకాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సందర్శకులు వస్తుంటారు.
News April 21, 2025
నాడు ‘పాకాల’.. నేడు ‘నర్సంపేట’

ప్రస్తుత నర్సంపేట నియోజకవర్గం 1956లో ఏర్పడింది. అంతకుముందు హైదరాబాద్ సంస్థానంలో ఈ ప్రాంతాన్ని పాకాల నియోజకవర్గంగా పేర్కొనేవారు. మొదట్లో పాకాల తాలూకాగా తర్వాత నర్సంపేటగా రూపాంతరం చెందింది. 1952లో పాకాల ఎమ్మెల్యేగా ఏ.గోపాలరావు గెలుపొందారు. 1957లో నర్సంపేట ఎమ్మెల్యేగా కనకరత్నమ్మ గెలిచారు. దీంతో నర్సంపేట అంటే పాకాల.. పాకాల అంటే నర్సంపేటగా ప్రత్యేక గుర్తింపు ఉంది.