News February 12, 2025
జనగామ: మున్సిపాలిటీ వార్డు అధికారులతో కలెక్టర్ సమీక్షా
జనగామ మున్సిపాలిటీ వార్డు అధికారులతో మంగళవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని టాక్సీ వసూళ్లు, ఇందిరమ్మ ఇళ్లు, పారిశుద్ధ్యం, ప్లాంటేషన్ తదితర విషయాలపై చర్చించారు. ఎల్ఆర్ఎస్, బిల్డింగ్ పర్మిషన్‌లపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటి పరిధిలో రోజువారీ పర్యవేక్షణ ఉండాలని సూచించారు.
Similar News
News February 12, 2025
బోయిన్పల్లి: మిడ్ మానేరులో 20 టీఎంసీల నీరు నిల్వ
బోయిన్పల్లి మండలంలోని మిడ్ మానేరులో 20 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం నుంచి ఎల్ఎండికి 2500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే పంట పొలాలకు కుడి కాలువ ద్వారా 300 క్యూసెక్కుల నీరు, ఎడమ కాలువ ద్వారా 5 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.
News February 12, 2025
HYD: నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి నేడు పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, సీఎస్ శాంతి కుమారి, ఆ శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, ఇతర శాఖల మంత్రులు, అధికారులు హాజరుకానున్నారు. ప్రభుత్వంవైపు నుంచి స్థానిక ఎన్నికల కోసం చేసిన, చేయాల్సిన ఏర్పాట్లు, డెడికేటెడ్ కమిషన్ నివేదికపై చర్చించనున్నారు.
News February 12, 2025
నిజామాబాద్‌లో ఫొటో జర్నలిస్టు మృతి
నిజామాబాద్‌లో అనారోగ్యంతో సీనియర్ ఫొటో జర్నలిస్టు రమణ మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆయన పలు వార్త పత్రికల్లో ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. కాగా ఆయన మృతి పట్ల జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రెస్ క్లబ్ సభ్యులు నివాళులర్పించారు.