News April 7, 2025
జనగామ: మూడెకరాల్లో పంట సాగు.. ఎకరానికే రైతు రైతుబంధు?

మూడెకరాల్లో పంట సాగు చేసినప్పటికీ తమకు రైతు రైతుబంధు అందలేదంటూ రైతులు గ్రామపంచాయతీ ముందు నిరసన చేపట్టిన ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలంలోని ఇప్పగూడం గ్రామంలో చోటు చేసుకుంది. 3 ఎకరాల్లో పంట సాగు చేస్తే ఎకరానికే రైతుబంధు అందిందని, ఏఈవోలు క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టలేదని రైతులు ఆరోపించారు. గ్రామంలో 72 మందికి రావాల్సి ఉందని, ఇప్పటికైనా రైతుబంధు అందించి రైతులను ఆదుకోవాలని వారు కోరారు.
Similar News
News April 17, 2025
అలంపూర్: విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన అదనపు కలెక్టర్

అలంపూర్ నియోజకవర్గ పరిధిలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్నం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. విద్యార్థుల భవిష్యత్తు మెరుగ్గా ఉండేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయులకు ఆయన ఆదేశించారు. కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయంలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని విద్యార్థులతో అడిగి తెలుసుకున్నారు.
News April 17, 2025
ఒంగోలు: త్వరలో ఈ చెక్ ఇతివృత్తంతో కార్యక్రమం

స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ నెలలో ఈ – చెక్ ఇతివృత్తంతో కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతినెలా మూడో శనివారం ప్రత్యేక ఇతివృత్తంతో పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 19న చేపట్టే కార్యక్రమంపై అన్ని శాఖల జిల్లా అధికారులతో గురువారం ప్రకాశం భవనంలో కలెక్టర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
News April 17, 2025
సిద్దిపేట: ‘ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై దృష్టి సారించాలి’

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించి ఈ నెల 30లోగా వంద శాతం పురోగతి సాధించాలని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిషోర్.. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ పాల్గొన్నారు.