News March 7, 2025

జనగామ: విద్యార్థులకు ముఖ్య గమనిక

image

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి పాఠశాల, కళశాలల్లో ప్రవేశం పొందేందుకు గడువు పొడిగించారు. 5 నుంచి 8వ తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశం పొందేందుకు మార్చి 31వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు

Similar News

News March 7, 2025

MBNR: రంజాన్ మాసం.. హలీంకు సలాం.!

image

రంజాన్ నెలలో దర్శనమిచ్చే నోరూరించే వంటకం హలీం. ఉపవాసాలుండే ముస్లింలతో పాటు హిందువులు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పటికే ఉమ్మడి MBNRజిల్లా వ్యాప్తంగా పట్టణాల్లో, ఆయా మండలాల కేంద్రాల్లో హలీం సెంటర్లు దర్శనమిస్తున్నాయి. మాంసం, గోధుమలు, పప్పుదినుసులు, నెయ్యి, డ్రైఫ్రూట్స్‌తో కలిపి ఉడికించి తయారు చేస్తారు. చివర్లో వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి వేస్తారు. మీరు తింటే ఎలాఉందో కామెంట్ పెట్టండి?

News March 7, 2025

ద్రవిడులు ఢిల్లీ నుంచి ఆదేశాలు తీసుకోరు: స్టాలిన్

image

కేంద్ర ప్రభుత్వంపై తమిళనాడు CM స్టాలిన్ విరుచుకుపడ్డారు. ద్రవిడులు జాతికి దిశానిర్దేశం చేస్తారు తప్ప ఢిల్లీ నుంచి ఆదేశాలు తీసుకోరని అన్నారు. ‘కేంద్ర విద్యామంత్రి మా రాష్ట్రంపై బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. గెలుపనేదే లేని యుద్ధాన్ని ఆయన ప్రారంభించారు. చరిత్ర స్పష్టంగా ఉంది. తమిళనాడుపై హిందీని రుద్దడానికి ట్రై చేసినవారు ఓడిపోయారు లేదా తర్వాత మాతో కలిసిపోయారు’ అని గుర్తుచేశారు.

News March 7, 2025

ఐనవోలు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

image

హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంతిని గ్రామంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. అయితే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు. క్షతగాత్రుడు ఇల్లంద గ్రామానికి చెందిన నిమ్మనబోయిన రమేశ్(38)గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!