News February 25, 2025
జనసంద్రంగా శ్రీశైలం

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల క్షేత్రం జనసంద్రంగా మారింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందినవారు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. మల్లన్నను దర్శించుకుని సాయంత్రం జరిగే ఉత్సవాలను తిలకించి భక్తులు తరిస్తున్నారు.
Similar News
News December 16, 2025
2026 ఏప్రిల్ నుంచి విశాఖలో ఏఐ (AI) ట్రాఫిక్ సిస్టమ్

విశాఖను ప్రపంచ స్థాయి ఆదర్శ పోలీసింగ్ నగరంగా మార్చేందుకు సీపీ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ‘సెవెన్ డ్రీమ్స్’ (Seven Dreams) ప్రణాళికను ప్రకటించారు. వీసీఎస్‌సీ (VCSC) సమావేశంలో ఆయన మాట్లాడారు. 2026 ఏప్రిల్ నాటికి ఏఐ (AI) ట్రాఫిక్ వ్యవస్థ, మహిళా రక్షణ, హోమ్ గార్డుల సంక్షేమం, నైట్ విజన్ కెమెరాలు, డ్రోన్లు, బీచ్ భద్రత, బాలికలకు హెచ్‌పీవీ టీకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
News December 16, 2025
చైల్డ్ కేర్ లీవ్స్‌లో పిల్లల వయోపరిమితి తొలగింపు

AP: ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్స్‌లో పిల్లల వయోపరిమితి నిబంధనను ప్రభుత్వం తొలగించింది. ఉద్యోగులు 180 రోజుల సెలవులను 10 విడతల్లో సర్వీసులో ఎప్పుడైనా వినియోగించుకోవచ్చు. అయితే పిల్లల వయో పరిమితితో వాటిని వాడుకోలేకపోతున్నామని వారు సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో ప్రభుత్వం ఆ నిబంధనను ఎత్తివేస్తూ GO ఇచ్చింది. కాగా ఉమెన్, విడో, డివోర్స్, సింగిల్ మెన్ ఎంప్లాయీస్‌కి ఈ చైల్డ్ కేర్ లీవ్స్ కల్పిస్తున్నారు.
News December 16, 2025
నల్గొండ: పొత్తు వ్యూహంతో పదునెక్కిన కొడవళ్లు

ఇటీవల జరిగిన మొదటి, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పొత్తులతో కమ్యూనిస్టు పార్టీలు ఉత్తమ ఫలితాలు సాధించాయి. సీపీఎం 48, సీపీఐ 63, సీపీఐ(ఎంఎల్) మాస్ 10 స్థానాలు గెలుచుకున్నాయి. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, కొత్తగూడెం జిల్లాల్లో వీరి ప్రభావం స్పష్టంగా కనిపించింది. కొన్ని చోట్ల కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌తో పొత్తులు కలిసి వచ్చాయి.


