News October 22, 2024
జనసేన నాయకుడిపై పెట్టిన కేసు చిత్తూరు జిల్లా కోర్టు కొట్టివేత
శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినుత కోటా భర్త కోటా చంద్రబాబుపై పెట్టిన కేసును చిత్తూరు జిల్లా కోర్టు కొట్టి వేసిందని వినుత కోటా ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి ప్రోద్బలంతో పోలీసులు 17 అక్రమ కేసులు పెట్టారన్నారు. వాటిల్లో ఒకటి తప్పుడు కేసుగా నిరూపణ కావడంతో కోర్టు కొట్టేసిందని తెలిపారు.
Similar News
News December 27, 2024
కాలినడకన తిరుమల చేరుకున్న పీవీ సింధు
బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు కుటుంబ సభ్యులతో కలిసి కాలినడకన గురువారం తిరుమలకు చేరుకున్నారు. నూతన దంపతులకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. శుక్రవారం వేకువజామున ఆమె శ్రీవారి అభిషేక సేవలో స్వామి వారిని దర్శించుకోనున్నారు.
News December 25, 2024
అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపి వ్యవహారంపై నారా లోకేశ్ స్పందన
తిరుపతిలోని అన్నమయ్య విగ్రహానికి శాంటా క్లాస్ టోపి వ్యవహారపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ‘జగన్ తిరుమల తిరుపతిని నువ్వు, నీ గ్యాంగ్ ఐదేళ్లు భ్రష్టు పట్టించినది చాలక ఇప్పుడు మళ్లీ విష ప్రచారానికి బరితెగించావు. అన్నమయ్య విగ్రహానికి బిచ్చగాడు శాంటా క్లాస్ టోపీని పెట్టడం సీసీ కెమెరాలలో స్పష్టంగా రికార్డు అయింది. అయినా ఫేక్ ప్రచారాలు ఆపడం లేదు.’ అంటూ ట్విట్టర్లో విమర్శించారు.
News December 25, 2024
తిరుపతి: వైకుంఠ ఏకాదశికి పటిష్ఠ బందోబస్తు
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ సుబ్బారాయుడు చెప్పారు. భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో టోకెన్లు జారీ చేసే కేంద్రాలలో తోపులాటలు చోటు చేసుకోకుండా, క్యూలైన్లను క్రమబద్ధీకరించేలా తగినంత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలు కూడా సహకరించి క్యూ లైన్లలో తోపులాటలు జరపకుండా టోకెన్లు పొందాలని సూచించారు. టీటీడీ, పోలీసుల సూచనలు పాటించాలన్నారు.