News February 23, 2025
జన్నారం: ఈ స్వామి మౌనదీక్షకు 50 ఏళ్లు

జన్నారం మండలం రోటిగూడ గీతా మందిర్ నిర్వాహకులు స్వామి మౌన దీక్షకు 50 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రజలలో ఆధ్యాత్మిక భావనను పెంచేందుకు 1975లో ఆయన మౌన దీక్షను చేపట్టారు. అప్పటినుంచి మౌనస్వామి గీతాశ్రమం ద్వారా పూజా, ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మౌనస్వామి మౌనదీక్ష చేపట్టి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల గంగాధర్, భక్తులు ఆయనను సన్మానించారు.
Similar News
News February 23, 2025
ప్రకాశం: గ్రూప్- 2 మెయిన్స్‌కు 579 మంది గైర్హాజరు.!

ప్రకాశం జిల్లాలో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలకు హాజరైన అభ్యర్థుల వివరాలను జిల్లా కలెక్టరేట్ ప్రకటించింది. పేపర్- 1కు మొత్తం 4544 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 3968 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 576 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. అలాగే పేపర్- 2 పరీక్షకు 4544 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా.. 3965 మంది హాజరయ్యారు. 579 మంది గైర్హాజరయ్యారు.
News February 23, 2025
HYD: పిల్లలపై పెరుగుతున్న అఘాయిత్యాలు..!

గ్రేటర్ HYD పరిధిలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. POCSO చట్టం కింద నమోదైన కేసుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోంది. 2022- 426, 2023- 559, 2024- 713 కేసులు నమోదయ్యాయి. ఈ పెరుగుదలపై పోలీసులు, సామాజిక సంస్థలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. మరోవైపు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని, సమాజంలో జరుగుతున్న క్రైమ్ గురించి పిల్లలకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు.
News February 23, 2025
రేపు 3 జిల్లాల్లో సీఎం ప్రచారం

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉ.11 గంటలకు నిజామాబాద్, మ.1.30 గం.కు మంచిర్యాల, సా.3.30 గంటలకు కరీంనగర్‌లో బహిరంగ సభలను నిర్వహించనున్నారు. ఇందులో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్, సీతక్క, జూపల్లి, కొండా సురేఖ పాల్గొననున్నారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది.