News April 8, 2025
జన్నారం: ఐటీఐ పాసైన విద్యార్థులకు ఉద్యోగాలు

రాష్ట్ర ప్రభుత్వ సంస్థ తెలంగాణ ఓవర్సీస్ మన్ పవర్ కంపెనీ, టామ్‌కామ్ సహకారంతో వివిధ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని జన్నారం ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ బండి రాములు సోమవారం మధ్యాహ్నం తెలిపారు. ఈ ఉద్యోగాల కోసం ఈనెల 8 జన్నారం ఐటీఐ కళాశాలలో 11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఐటీఐ చేసిన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News April 17, 2025
ముర్షిదాబాద్ అల్లర్లపై సిట్ ఏర్పాటు

పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఇటీవల జరిగిన అల్లర్లపై రాష్ట్ర పోలీసులు 9మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గత వారం అక్కడ జరిగిన ఆందోళనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో హింసకు కారకులు, తదితరాలపై ప్రభుత్వానికి సిట్ నివేదిక అందించనుంది. మరోవైపు అల్లర్లలో మృతి చెందిన ముగ్గురి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చొప్పున CM మమత నష్టపరిహారం ప్రకటించారు.
News April 17, 2025
ఆసిఫాబాద్ కలెక్టర్ నేటి పర్యటన వివరాలు

ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రే గురువారం వాంకిడి మండలంలో పర్యటిస్తారని MRO రియాజ్ అలీ తెలిపారు. గురువారం ఉదయం 9 గంటలకు మండలకేంద్రంలోని రైతువేదికలో భూ భారతీ 2025 మీద అవగాహన సదస్సులో పాల్గొంటారని పేర్కొన్నారు. సదస్సుకు అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), RDO తదితర ఉన్నతాధికారులు హాజరవుతారన్నారు. రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
News April 17, 2025
గద్వాల: క్రికెట్ బెట్టింగ్.. ఏడుగురిపై కేసు నమోదు

తనగల గ్రామానికి చెందిన వీరేంద్ర ఆచారి ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నట్లు సమాచారం మేరకు వడ్డేపల్లి ఎస్ఐ నాగశేఖర్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు దాడి చేసి కేసు నమోదు చేశారు. వీరేంద్రతో పాటు మరో ఆరుగురిపై విచారణ జరిపి కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మండలంలో క్రికెట్ బెట్టింగ్ ఆడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, గ్రామాల్లో బెట్టింగ్ ఆడేవారి సమాచారం పోలీసులకు తెలియజేయాలని ఆయన కోరారు.