News March 21, 2025

జన్నారం: కెనాల్‌లో పడి డిగ్రీ విద్యార్థి మృతి

image

హుజూరాబాద్ మండలంలోని కాకతీయ కెనాల్‌లో గల్లంతై డిగ్రీ విద్యార్థి మృతిచెందాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన అరవింద్‌గా పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన అరవింద్ కరీంనగర్‌లోని SRR డిగ్రీ కాలేజీలో చదువుతున్నాడు. 19వ తేదీన స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. కాగా, నిన్న మృతదేహం లభ్యమైంది. 

Similar News

News March 31, 2025

CSK ‘ధోనీ’ని వదులుకోలేక!

image

ధోనీ ఉంటేనే CSK. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోతోంది. ప్రస్తుతం ధోనీ బ్యాటింగ్ చూస్తే సగటు చెన్నై ఫ్యాన్‌కి అసహనం కలుగుతోంది. బ్యాటింగ్‌లో మేనేజ్మెంట్ ధోనీకి స్వేచ్ఛనివ్వగా యంగ్ ప్లేయర్లకు ఛాన్స్ రావట్లేదని పలువురు ఫ్యాన్స్ అంటున్నారు. అటు శరీరం సహకరించక MS ఆలస్యంగా బ్యాటింగ్‌కు వస్తున్నారని కోచ్ ఫ్లెమింగ్ చెప్పారు. ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయలేక పరిస్థితిని బట్టి క్రీజులోకి వస్తున్నారని తెలిపారు.

News March 31, 2025

విశాఖ: యువకుడిపై కోపంతో బైక్‌లకు నిప్పు పెట్టిన యువతి

image

విశాఖలోని సింగ్ హోటల్ జంక్షన్ సమీపంలో ఉన్న అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో శుక్రవారం అర్ధరాత్రి 18 బైకులు దగ్ధమైన విషయం తెలిసిందే. అయితే ఓ యువతి ఈ పని చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఓ వ్యక్తితో విభేదాల కారణంగా అతని బైక్‌‌కు నిప్పు పెట్టగా ఆ మంటలు మిగతా బైక్‌లకు కూడా అంటుకుని దగ్ధమయ్యాయి. సదరు మహిళ ఆ యువకుడిని గతంలో ప్రేమించిందని అతడికి వేరొకరితో పెళ్లి కావడంతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

News March 31, 2025

ఇల్లందకుంట: ఏప్రిల్ 4 నుంచి సీతారాముల బ్రహ్మోత్సవాలు

image

KNR జిల్లా ఇల్లందకుంట సీతారాములవారి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4 నుంచి ప్రారంభంకానున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం 13 రోజులపాటు ఈ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఇందులో భాగంగా కల్యాణం, పట్టాభిషేకం, చిన్నరథం, పెద్దరథం మొదలగు కార్యక్రమాలు ఉంటాయి. ప్రసుత్తం ఆలయ కమిటీ, ఉత్సవ కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేయలేదు. ఉమ్మడి KNR జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.

error: Content is protected !!