News December 28, 2024

జపనీస్ భాషపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలి: కలెక్టర్

image

జిల్లాలోని వివిధ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు ఆన్‌లైన్ ద్వారా జపనీస్ భాషపై శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్‌లోని కలెక్టర్ ఛాంబర్‌లో శుక్రవారం పలు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న డిమాండుకు అనుగుణంగా కోర్సులపై శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు.

Similar News

News December 29, 2024

పీఎం సూర్యఘర్ పథకం అమలుపై కలెక్టర్ సమావేశం

image

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని పీఎం సూర్యఘర్ పథకం అమలుపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సౌర విద్యుత్ వినియోగం పెంచేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. 5వేలకు పైగా జనాభా ఉండి, సౌర విద్యుత్ వినియోగించే గ్రామాలను గుర్తించాలన్నారు. సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహించేలా కేంద్ర ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

News December 28, 2024

ఒంగోలు: ఆరు నెలల్లో 367 మంది క్షేమంగా ఇళ్లకు.!

image

జిల్లాలో గత ఆరు నెలల్లో 367 మంది తప్పిపోయిన, కిడ్నాప్‌కు గురైన వారిని క్షేమంగా కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు  ఎస్పీ దామోదర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. మిస్సింగ్ కేసులను ఛేదించేందుకు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలో ప్రత్యేక బృందాలు ఉన్నట్లు చెప్పారు. అలా 367 ‌మందిని గుర్తించి తీసుకొచ్చామన్నారు.

News December 28, 2024

పోలీసులు ప్రజల మన్ననలు పొందాలి: ఎస్పీ

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ – 2025ని శనివారం ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కొత్త సంవత్సరంలో కూడా పోలీసు అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించి, శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజల మన్ననలు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, డీఎస్పీలు శ్రీనివాసరావు, లక్ష్మి నారాయణ, నాగరాజు పాల్గొన్నారు.