News April 13, 2025
జలపాతంలో పూర్ణామార్కెట్ యువకులు గల్లంతు

అనకాపల్లి జిల్లా సరిహద్దులోని సరియా జలపాతంలో ఆదివారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. విశాఖ పూర్ణ మార్కెట్‌కు చెందిన ఆరుగురు స్నేహితులు జలపాతం చూసేందుకు రాగా, వారిలో ఇద్దరు జలపాతంలో గల్లంతయ్యారు. దేవరాపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ఇద్దరు యువకులు వెళ్ళగా.. ఘటనా ప్రదేశం అనంతగిరి పీఎస్ లిమిట్స్‌లో ఉందని తెలుసుకుని అక్కడ ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 16, 2025
కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్షించనున్న విశాఖ ఎంపీ

డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (దిశా) సమావేశం విశాఖ కలెక్టర్ ఆఫీసులో గురువారం జరగనుందని దిశా కన్వీనర్ నారాయణమూర్తి బుధవారం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పథకాల అమలుపై విశాఖ ఎంపీ శ్రీ భరత్ సమీక్షిస్తారని వెల్లడించారు. జిల్లా అధికారులు పూర్తి నివేదికలతో హాజరు కావాలని కోరారు.
News April 16, 2025
చందనోత్సవం ఏర్పాట్ల పరిశీలించిన విశాఖ సీపీ

సింహాచలం చందనోత్సవం ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ బుధవారం పర్యవేక్షించారు. గోశాల జంక్షన్ వద్ద పార్కింగ్, ఘాట్ రోడ్లో మలుపులు, క్యూలైన్లు, ఆలయ పరిసరాల్లో స్టాప్ బోర్డులను పరిశీలించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పార్కింగ్ ప్రాంతాలు తెలిసేలా సైన్ బోర్డులు పెట్టాలని, పార్కింగ్ ప్రాంతాల్లో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు విశాలంగా ఉండాలని సూచించారు.
News April 16, 2025
ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ: మంత్రి

రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారానికై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించిందని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. విశాఖ కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం అధికారులతో సమావేశమయ్యారు.రీ సర్వేపై వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు, 22ఏ తొలగింపునకు దరఖాస్తులు వస్తున్నాయని వాటిని పరిష్కరిస్తామని కలెక్టర్ వివరించారు.