News February 26, 2025

జలవనరులను భద్రంగా నిల్వ చేసుకోవాలి: బాపట్ల కలెక్టర్

image

వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడకుండా అధికారులు జలవనరులను భద్రంగా నిల్వ చేసుకోవాలని కలెక్టర్ వెంకట మురళి ఆదేశించారు. జల వనరుల సంరక్షణ, సరఫరాపై అధికారులతో మంగళవారం బాపట్ల కలెక్టరేట్ నుంచి ఆయన వీక్షణ సమావేశం నిర్వహించారు. రానున్న వేసవి దృష్ట్యా ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని తాగునీటి చెరువులన్నింటినీ నూరు% నింపాలన్నారు.

Similar News

News February 26, 2025

సిరిసిల్ల: ఓటుహక్కు సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్‌లో బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. సిరిసిల్ల జిల్లాలో మొత్తం 22,397 మంది పట్టభద్రులు, 950 మంది ఉపాధ్యాయులు ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. ప్రతి పట్టభద్రుడు, ఉపాధ్యాయుడు తమ ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

News February 26, 2025

ఉత్త‌రాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్ధం

image

ఉత్త‌రాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి. జిల్లా ఎన్నిక‌ల అధికారి డాక్ట‌ర్ బీఆర్.అంబేడ్కర్ ఆదేశాల‌కు అనుగుణంగా రెవెన్యూ అధికారులు ఎన్నిక‌కు అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌ను పూర్తి చేశారు. జిల్లాలో మొత్తం 5,223 మంది ఉపాధ్యాయులు త‌మ ఓటుహ‌క్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 3,270 మంది పురుషులు కాగా, 1,953 మంది మ‌హిళా ఓట‌ర్లు ఉన్నారు.

News February 26, 2025

కీసరలో రోడ్డు ప్రమాదం.. అన్నదమ్ములు మృతి

image

కీసర PS పరిధిలోని యాదగిరిపల్లిలో ORR సర్వీస్ రోడ్‌ మీద ప్రమాదం జరిగింది. పోలీసుల వివరాలు.. గూడూరు చంద్రశేఖర్ (32), మత్స్యగిరి (27) అన్నదమ్ములు. శ్రీను అనే మరో వ్యక్తితో బైక్‌పై బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి వస్తుండగా ORR సర్వీస్ రోడ్‌లో ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టింది. చంద్రశేఖర్ అక్కడిక్కడే చనిపోయాడు. మత్స్యగిరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా, మార్చి 20న మత్స్యగిరి వివాహం జరగాల్సి ఉంది.

error: Content is protected !!