News April 8, 2024
జహీరాబాద్: గెలుపే లక్ష్యంగా వ్యూహాలు !

ZHB లోక్సభ స్థానంలో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు ప్రచార వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఆయాఅసెంబ్లీ సెగ్మెంట్ల వారికి ఓటర్లను ప్రసన్న చేసుకునేందుకు ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నాయి. కాంగ్రెస్ ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటూ, ప్రభుత్వ విధానాలను వివరిస్తూ ముందుకెళ్తుంది. మోదీతోపాటు పార్టీ అగ్రనేతలతో బహిరంగ సభలకు BJP ప్లాన్ చేస్తుంది. పార్టీ శ్రేణులకు భరోసా కల్పిస్తూ పోరుకు BRS సన్నద్ధమవుతోంది.
Similar News
News April 20, 2025
మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావుపై ఎస్పీకి ఫిర్యాదు

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు చేసిన వ్యాఖ్యలపై వెంటనే కేసు నమోదు చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆదివారం ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. మాజీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు సరికాదని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.
News April 20, 2025
ధరణికి ప్రత్యామ్నాయంగా భూభారతి: మెదక్ కలెక్టర్

ధరణి వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం భూ భారతి చట్టం అమలు చేస్తుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం కుల్చారం మండలం రైతు వేదికలో భూభారతి చట్టం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆర్టీవో మహిపాల్ రెడ్డి, అధికారులు హాజరయ్యారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు భూభారతి చట్టంపై పాటలతో అవగాహన కల్పించారు.
News April 20, 2025
సిద్దిపేట: తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య

తల్లిదండ్రులు మందలించారని యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన రాయపోలు మండలంలో జరిగింది. ఎస్ఐ రఘుపతి వివరాల ప్రకారం.. మండలంలోని మంతూరుకు చెందిన ప్రిస్కిల్లా(25) మూడేళ్ల నుంచి మానసిక స్థితి బాగోలేదు. ఈ క్రమంలో మాత్రలు వేసుకోమంటే నిరాకరించడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురై 17న పురుగు మందు తాగింది. చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.