News June 4, 2024
జహీరాబాద్లో కాంగ్రెస్ హవా
జహిరాబాద్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. ఐదో రౌండ్ ఓట్ల లెక్కింపు ముగిసే సమయానికి కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్ షట్కార్ 13,074 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Similar News
News January 3, 2025
NZB: పాముతో చెలగాటం ఆడుతున్న బాలురులు
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కొందరు చిన్న పిల్లలు పాములతో ప్రమాదకరంగా విన్యాసాలు చేశారు. ఈ ఘటన గురువారం నగరంలోని ఖిల్లా రఘునాథ ఆలయం ముఖ ద్వారం వద్ద చోటుచేసుకుంది. పీల స్కూల్ సమీపంలో పామును పట్టుకొని కొందరు పిల్లలు ఆటలాడుతూ తిరిగారు. కొంచెమైనా భయం లేకుండా పాముతో చెలగాటం ఆడుతూ సెల్ఫీలు దిగారు. పిల్లలపై స్థానిక వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు.
News January 3, 2025
NZB: ఉమ్మడి జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి దీంతో చలి పంజాబీ విసురుతుంది. ఉదయం మంచు ఉగ్రరూపం ప్రదర్శిస్తుంటే రాత్రి చలి తాకిడి ఎక్కువవుతుంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు డోంగ్లి 10.2, గాంధారి 11.2, జుక్కల్ 11.5, సర్వాపూర్ 12.7, మేనూర్ 12.9 కాగా నిజామాబాద్ జిల్లాలో మెండోరా 12.5, తుంపల్లి 13.1 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News January 2, 2025
మాచారెడ్డి: రెసిడెన్షియల్ కోసం ఫేక్ ఆధార్..
రెసిడెన్షియల్ కోసం మీసేవ నిర్వాహకుడు డూప్లికేట్ ఆధార్ క్రియేట్ చేసిన ఘటన మాచారెడ్డి మండలం ఘన్పూర్లో జరిగింది. పోలీసుల వివరాలిలా.. గ్రామానికి చెందిన ముహమ్మద్ షరీఫ్ ఫిలిప్పీన్ దేశానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె రెసిడెన్షియల్ సర్టిఫికెట్ కోసం మీసేవ నిర్వాహకుడి సాయంతో డూప్లికేట్ ఆధార్ తయారు చేశారు. భార్యాభర్తల ఆధార్ నంబర్ సేమ్ ఉండడంతో RI రమేశ్ PSలో ఫిర్యాదు చేశారు.