News May 16, 2024

జహీరాబాద్‌లో పెరిగిన పోలింగ్.. గెలువు ఎవరిదో..?

image

జహీరాబాద్‌ పార్లమెంట్ పరిధిలో 2019 ఎన్నికలతో పోల్చితే ఈ సారి 4.93 శాతం పోలింగ్ పెరిగింది. 2019లో 69.01 శాతం నమోదు కాగా 2024లో 74.63 శాతం నమోదైంది. మొత్తం 16.41 లక్షలకు 12.25లక్షల మంది ఓటేశారు. ఇక్కడ 2019లో బీబీపాటిల్(BRS) 6,229 మెజార్టీతో మదన్ మోహన్ రావు(INC)పై గెలుపొందారు. కాగా ఈ ఎన్నికలో సురేశ్ షెట్కార్(INC), గాలి అనిల్ కుమార్(BRS), బీబీ పాటిల్,(BJP) బరిలో ఉన్నారు. గెలుపెవరిదో కామెంట్ చేయండి.

Similar News

News January 23, 2025

నిజామాబాద్: బడారాంమందిర్ గోశాలలో అగ్నిప్రమాదం

image

నిజామాబాద్ గాజుల్పేట్ బడా రాంమందిర్ గోశాలలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్నం ఆలయం పక్కనే ఆవుల కోసం నిల్వ ఉంచిన గడ్డికి అకస్మాత్తుగా మంటలు అంటుకున్నాయి. క్షణాల్లోనే గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. కాలనీవాసులు వెంటనే స్పందించి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించగా వారు స్పందించి మంటలను ఆర్పివేశారు.

News January 23, 2025

డిచ్పల్లి: బైక్ చోరీ.. నిందితుడి అరెస్ట్

image

బైక్ చోరీ చేసిన నిందితుడిని అరెస్టు చేసినట్లు గురువారం డిచ్పల్లి సీఐ మల్లేశ్ తెలిపారు. ఈ నెల 21వ తేదీన ధర్మారం(బీ) లో ద్విచక్ర వాహనాన్ని గుర్తుతెలియని దుండగుడు చోరీ చేశాడు. బాధితుడు సోమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డిచ్పల్లిలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా బిచ్కుందకు చెందిన మంగళి దత్తు వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తించి, నిందితుడిని అరెస్టు చేశారు.

News January 23, 2025

NZB: జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించాలి: డీఈవో

image

ఈ నెల 25న జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యం జాతీయ ఓటర్ దినోత్సవాన్ని నిర్వహించాలని డీఇఓ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రదర్శనలు, జాతీయ ఓటర్ ప్రతిజ్ఞ, విద్యార్థుల ర్యాలీ, ఎస్సే రైటింగ్, క్విజ్ తదితర పోటీలను విద్యార్థులకు నిర్వహించాలని ఆయన ఆదేశించారు.