News March 7, 2025

జహీరాబాద్‌లో విషాదం.. పొలంలో విద్యుత్ షాక్‌తో అన్నదమ్ములు మృతి

image

జహీరాబాద్ మండలం గోవింద్‌పూర్ గ్రామంలో గురువారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది. పొలంలో ప్రమాదవశత్తు విద్యుత్ షాక్‌కు గురై మధుగొండ జగన్, మల్లేష్ అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు, సంబంధిత అధికారులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది. కాగా, గత సంవత్సరం ఇదే కుటుంబానికి చెందిన తండ్రి నాగన్న పాము కాటుకు గురై మరణించడం గమనార్హం.

Similar News

News March 7, 2025

సీతంపేట కంపెనీకి జాతీయ స్థాయి అవార్డు

image

సీతంపేట మండలంలోని మన్యం సహజ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ జాతీయ స్థాయి భారత్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఫర్ కలెక్టివ్ ఎంటర్ప్రైజెస్ అవార్డుకు ఎంపికైనట్లు డైరెక్టర్లు నూక సన్యాసిరావు, కర్రేక గౌరమ్మ గురువారం తెలిపారు. సీతంపేట ఈ అవార్డుకు ఎంపిక కావడం గర్వకారణమని వారు పేర్కొన్నారు. రైతులు మెరుగైన ఆదాయం పొందడంతో పాటు మహిళల్లో నైపుణ్యాల అభివృద్ధికి ఈ కంపెనీ ఉపయోగపడుతుందని సీఈఓ బి.శంకరరావు తెలిపారు.

News March 7, 2025

చందోలు పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

image

తమకు రక్షణ కల్పించాలని ఓ ప్రేమ జంట గురువారం చందోలు పోలీసులను ఆశ్రయించింది. పిట్టలవానిపాలెం మండలం పరిసవారిపాలెం గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి అనే యువకుడు అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తమకు కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 7, 2025

VZM: జిల్లాలో నామినేటెడ్ పదవులు ఎవరికి దక్కేనో..?

image

మార్చిలోగా నామినేటెడ్ పదవుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ దిశగా అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. అయితే జిల్లాలో నామినేటెడ్ పదవులు ఎవరికి వరిస్తాయోనన్న చర్చ జోరుగా సాగుతుంది. ప్రధానంగా ఎస్.కోట నుంచి గొంప కృష్ణ, చీపురుపల్లి నుంచి కిమిడి నాగార్జున గత ఎన్నికల్లో టికెట్ ఆశించారు. జనసేన, బీజేపీలో కూడా ఆశావహులు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

error: Content is protected !!